E6TV Special Storys
it is exclusive Content for E6TV
కార్పొరేట్ ఆసుపత్రుల్లో జర్నలిస్టులకు హెల్త్ కార్డు వర్తింపజేయాలి
ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు వైద్య సదుపాయాలు కల్పించాలి: టీయూడబ్ల్యూజె హెచ్-143 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్ నిజామాబాద్ ఆగస్టు 12: (E6 tv NEWS, శివ ఠాకూర్). ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే జర్నలిస్టులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు కల్పించాలని టీయూడబ్ల్యూజె హెచ్-143 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో టీయూడబ్ల్యూజె హెచ్-143 జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ…
నిరుపేద కుటుంబానికి అండగా జమ్మికుంట 6వ వార్డు కౌన్సిలర్
జమ్మికుంట, ఆగస్టు 12: (E6 tv NEWS: ప్రతినిధి). ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ జమ్మికుంట 6వ వార్డు కౌన్సిలర్ శ్రీపతి స్వర్ణలత నరేష్ తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన సీర్ల అనిత రాణి అనారోగ్యంతో మృతి చెందగా, ఆమె అంతిమయాత్రలో కౌన్సిలర్ శ్రీపతి స్వర్ణలత నరేష్ పాల్గొన్నారు.హౌసింగ్ బోర్డు కాలనీలో సుమారు 30 సంవత్సరాలుగా అద్దెకు ఉంటున్న సీర్ల అనిత రాణి ప్రైవేట్ నర్సుగా పనిచేస్తూ కుటుంబాన్ని…
దివ్యాంగుల సంక్షేమంపై కేంద్ర మంత్రితో ఎంపీ అర్వింద్ భేటీ
న్యూఢిల్లీ ఆగస్టు 12: (E6 tv NEWS ప్రతినిధి). ఎంపీ ధర్మపురి అర్వింద్ కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి డా. వీరేంద్ర కుమార్‌ను న్యూఢిల్లీలో కలిశారు. నిజామాబాద్ నియోజకవర్గంలోని దివ్యాంగుల సంక్షేమం, సాధికారతకు సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించారు. దివ్యాంగులకు అందుతున్న సంక్షేమ పథకాలు, సహాయక పరికరాల పంపిణీ, ప్రభుత్వ సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడం వంటి అంశాలను ఎంపీ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వీల్‌చైర్లు, వినికిడి పరికరాలు,…
బిచ్చుకుంద డిగ్రీ కళాశాలలో సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమం
బిచ్చుకుంద, ఆగస్టు 12: (E6 tv NEWS ప్రతినిధి). బిచ్చుకుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థినులకు ప్రేమ, మోసాలు, మైనర్ డ్రైవింగ్, మాదక ద్రవ్యాల నిర్మూలన, సైబర్ నేరాలు, మైనర్లపై జరిగే నేరాలు తదితర సామాజిక అంశాలపై పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆదేశాల మేరకు, బిచ్చుకుంద ఎస్‌ఐ జి. రాజు సూచనలతో ఏఎస్ఐ డి. దేవరాజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పోలీస్…
స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదల చేసిన MHSRB
హైదరాబాద్: తెలంగాణ వైద్య ఆరోగ్య సేవల నియామకాల బోర్డు (MHSRB) మంగళవారం మరో 10 విభాగాలకు చెందిన సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్) పోస్టుల ప్రొవిజనల్ మెరిట్ జాబితాలను విడుదల చేసింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ (డీఎస్‌హెచ్) పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీల భర్తీ ప్రక్రియను ముమ్మరం చేస్తూ ఈ ప్రకటన విడుదల చేశారు. ఆప్తాల్మాలజీ, ఈఎన్‌టీ, పాథాలజీ, డెర్మటాలజీ, సైకియాట్రీ, పల్మొనాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయోలాజీ విభాగాలకు సంబంధించిన ప్రొవిజనల్…
సీజనల్ వ్యాధులపై అవగాహనకు షార్ట్‌ఫిల్మ్ ఆవిష్కరణ
నిజామాబాద్ ఆగస్టు 12: E6 tv NEWS ( శివ ఠాకూర్).వర్షాకాలంలో సంభవించే సీజనల్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రూపొందించిన “మన ఆరోగ్యం మన చేతుల్లోనే” అనే షార్ట్‌ఫిల్మ్‌ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ ఆవిష్కరించారు.గోవిందపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మానస ఆధ్వర్యంలో, ఉపాధ్యాయుడు కోకిల నాగరాజు రచించి, రూపొందించిన ఈ షార్ట్‌ఫిల్మ్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి. రాజశ్రీ మాట్లాడుతూ.. వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొనే…
భూ కేటాయింపులపై కేటీఆర్‌వి అబద్ధపు ప్రచారాలు: మంత్రి శ్రీధర్ బాబు ధ్వజమెత్తు
హైదరాబాద్: భూ కేటాయింపులు మరియు ఇతర అంశాలపై బిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మండిపడ్డారు. బుధవారం గాంధీ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఫామ్‌హౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్ పండించిన వడ్లకు ఎంత మద్దతు ధర వచ్చిందో ముందుగా రైతులకు కేటీఆర్ సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. భూ కేటాయింపులపై కేటీఆర్ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టిన శ్రీధర్ బాబు, కాంగ్రెస్ ప్రభుత్వం…
తెలంగాణను హెచ్‌ఐవీ రహిత రాష్ట్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్: హెచ్‌ఐవీ, ఎయిడ్స్, సిఫిలిస్ వంటి వ్యాధుల నివారణ, ముందస్తు గుర్తింపు మరియు చికిత్సపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు హైదరాబాద్‌లోని హెచ్‌ఎమ్‌డీఏ (HMDA) మైదానం నుంచి నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ వరకు భారీ అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుమారు 1,500 మంది పాల్గొన్నారు. “బీ పాజిటివ్ – స్టాప్ హెచ్‌ఐవీ పాజిటివ్” (Be Positive –…
లో-వోల్టేజ్ సమస్య పరిష్కారం, నష్టాల నివారణకు TGNPDCL కీలక చర్యలు
హైదరాబాద్: తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (TGNPDCL) పరిధిలో వోల్టేజ్ సమస్యలను అధిగమించేందుకు, సాంకేతిక విద్యుత్ నష్టాలను (Technical Losses) తగ్గించేందుకు కెపాసిటర్ బ్యాంకులు, వోల్టేజ్ బూస్టర్ల ఏర్పాటు ద్వారా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (CMD) కర్నాటి వరుణ్ రెడ్డి వెల్లడించారు. TGNPDCL పరిధిలో దాదాపు 14 లక్షల వ్యవసాయ విద్యుత్ పంపుసెట్లు ఉన్నాయని, ఇండక్టివ్ లోడ్ (Inductive Load) ఎక్కువగా ఉండటం వల్ల పవర్ ఫ్యాక్టర్ తగ్గి,…
ఎయిడ్స్‌పై రెండు నెలల పాటు విస్తృత అవగాహన కార్యక్రమం
నిజామాబాద్ ఆగస్టు 12: (E6 tv NEWS, శివ ఠాకూర్). హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఎయిడ్స్ విభాగం ఆధ్వర్యంలో రెండు నెలల పాటు నిర్వహించనున్న విస్తృత అవగాహన కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) శ్రీ భుజంగరావు బుధవారం ప్రారంభించారు.నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అదనపు కలెక్టర్ ఛాంబర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి. రాజశ్రీతో కలిసి ఐఐఈసీ (Intensified Information, Education & Communication) కార్యక్రమాన్ని…

