Breaking News

పారిశ్రామిక అనుమతులకు ఏఐ (AI) విప్లవం.. త్వరలో అందుబాటులోకి ‘TG-iPASS 2.0’!

హైదరాబాద్: తెలంగాణలో పరిశ్రమలు, పెట్టుబడులను మరింత ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. సింగిల్ విండో ఆన్‌లైన్ పారిశ్రామిక అనుమతుల వ్యవస్థను మరింత వేగవంతంగా, పారదర్శకంగా మార్చేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో కూడిన ‘TG-iPASS 2.0’ పోర్టల్‌ను త్వరలోనే ప్రవేశపెట్టనుంది. గతంలో ఉన్న 69 రకాల అనుమతులను ఏకంగా 162 రకాల సేవలకు పెంచుతూ అదనంగా 93 నూతన సేవలను ఈ నూతన విధానంలో చేర్చారు. దీనివల్ల పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన…

Read More

30 ఏళ్ల కళారూపాలు, ‘బసవ’ శిల్పాల ప్రదర్శన.. స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్‌లో డాక్టర్ హోతీ బసవరాజ్ సోలో ఎగ్జిబిషన్!

హైదరాబాద్: తెలుగు నేల సాంస్కృతిక, వ్యవసాయ ప్రాధాన్యతకు నిలువెత్తు రూపమైన ‘బసవ’ (ఎద్దు) ప్రాశస్త్యాన్ని ప్రతిబింబిస్తూ ప్రముఖ శిల్పి, చిత్రకారుడు డాక్టర్ హోతీ బసవరాజ్ రూపొందించిన ప్రత్యేక శిల్ప కళా ప్రదర్శన హైదరాబాద్‌లోని స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ (State Gallery of Art) లో ఘనంగా ప్రారంభమైంది. గడచిన 30 ఏళ్లుగా బసవని రూపాలపై ఆయన చేసిన కృషిని ఈ ఎగ్జిబిషన్ ద్వారా సందర్శకులకు అందుబాటులో ఉంచారు. చిన్నతనం నుంచే తన తల్లి పూజల కోసం…

Read More

SIR ప్రక్రియను జిల్లాలో 100 శాతం పూర్తి చేయాలి: ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

నిజామాబాద్, జూలై 30: E6 tv NEWS ప్రతినిధి. జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను దాదాపు 100 శాతం పూర్తి చేసేలా బీఎల్ఏలు సమర్థవంతంగా పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి సూచించారు.శుక్రవారం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా డీసీసీ అధ్యక్షులు కాట్‌పల్లి నాగేష్ రెడ్డి అధ్యక్షతన జిల్లా PAC సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలోని…

Read More

తెలంగాణలో నిరుద్యోగులకు భారీ శుభవార్త: 7,437 పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో యూనిఫాం ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TGSLPRB) వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న మొత్తం 7,437 సబ్ ఇన్స్పెక్టర్ (SI), కానిస్టేబుల్ (PC), ఇతర పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. శాఖల వారీగా ఖాళీల వివరాలు: 1. పోలీస్ శాఖ (మొత్తం 5,000 పోస్టులు): 2. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్…

Read More

విద్యారంగంలో సంచలనాత్మక మార్పులు రావాలి.. గ్లోబల్ పోటీకి విద్యార్థులను సిద్ధం చేయండి: సీఎం రేవంత్ రెడ్డి పిలుపు!

హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా తెలంగాణలోని విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. ఫిన్‌లాండ్ మరియు జర్మనీ అధ్యయన పర్యటనలను ముగించుకుని తిరిగొచ్చిన ఉపాధ్యాయుల బృందంతో గురువారం ఆయన ప్రత్యేకంగా ముఖాముఖి నిర్వహించారు. తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు, నాణ్యమైన విద్య, నైపుణ్యాలు మరియు గ్లోబల్ కాంపిటీటివ్‌నెస్ అత్యంత కీలకమని సీఎం స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగంలోని ప్రధాన ముఖ్యాంశాలు:…

Read More

టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్స్ పరీక్షల నేపథ్యంలో సెక్షన్ 163 BNSS అమలు

ఆగస్టు 2న పరీక్షా కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు – పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య నిజామాబాద్, జూలై 30: E6 tv NEWS. టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్స్ (TTC) ఆగస్టు–2026 పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ఆదేశాల మేరకు భారతీయ నాగరిక సురక్షా సంహిత (BNSS) సెక్షన్–163 కింద నిషేధాజ్ఞలు అమలు చేయనున్నట్లు పోలీస్ కమిషనరేట్ వెల్లడించింది.ఆగస్టు 2 (ఆదివారం) నిర్వహించే పరీక్షల సందర్భంగా నిజామాబాద్…

Read More

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ

ఇందూరు, జూలై 30: E6 tv NEWS (శివ ఠాకూర్) గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ సూచించారు. నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ సిబ్బంది డ్రైనేజీలు, నాలాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ కాకుండా తగిన చర్యలు…

Read More

హైడ్రాకు పూర్తి మద్దతు ప్రకటించిన ధర్మపురి సంజయ్

హైదరాబాద్ అభివృద్ధి, ప్రజా ఆస్తుల పరిరక్షణ కోసం హైడ్రా చర్యలు అభినందనీయం ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి నిజామాబాద్ జూలై 30: (E6 tv NEWS శివ ఠాకూర్). ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న హైడ్రా (HYDRAA) చర్యలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని కాంగ్రెస్ నాయకుడు ధర్మపురి సంజయ్ ప్రకటించారు. గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, చెరువులు, నాలాలు, ప్రభుత్వ…

Read More

వర్షాల వేళ విడతలవారీ లాగౌట్స్.. ఐటీ కంపెనీలతో ప్రత్యేక హాట్‌లైన్ ఏర్పాటుకు సైబరాబాద్ పోలీస్ ప్రణాళిక!

హైదరాబాద్: హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో చిన్నపాటి వర్షం కురిసినా గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోవడం, వేలాది మంది ఐటీ ఉద్యోగులు రోడ్లపై నరకయాతన అనుభవించడం నిత్యకృత్యంగా మారింది. వర్షాల సమయంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జారీ చేసే ‘ముందస్తు లాగౌట్ (Early Logout)’ హెచ్చరికలు అన్ని కంపెనీలకు సకాలంలో చేరడం లేదు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 1,500కు పైగా కంపెనీలకు హెచ్చరికలు (Advisories) త్వరగా చేరేలా కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు,…

Read More

విద్యావ్యవస్థలో సంస్కరణలు చేపట్టాలి.. హైదరాబాద్‌లో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) విజయ యాత్ర, ధర్నా!

హైదరాబాద్: నీట్ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారంలో విద్యార్థులు సాధించిన విజయాన్ని పురస్కరించుకుని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తెలంగాణ వాలంటీర్లు బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజా (People’s Plaza) వద్ద భారీ విజయ యాత్ర మరియు ధర్నా నిర్వహించారు. ఢిల్లీ ఆందోళనలో పాల్గొని తిరిగొచ్చిన ప్రతినిధులు ఈ ప్రదర్శనలో పాల్గొని జాతీయ జెండాలు, ప్లాకార్డులతో విద్యా సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లు ప్రజాకవి గద్దర్ పాటలు, నిరసన గీతాలు మరియు…

Read More