Breaking News

నాగర్‌కర్నూల్ పాలనలో సరికొత్త మార్క్.. కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ప్రజాపాలన విజయం!

నాగర్‌కర్నూల్ / హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయిన నాగర్‌కర్నూల్‌లో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ప్రజాకేంద్రక పాలనలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నారు. బాధ్యతలు స్వీకరించిన కేవలం 90 రోజుల్లోనే (మూడు నెలలు) 2019 బ్యాచ్‌కి చెందిన ఈ ఐఏఎస్ అధికారి నిరంతర ఫీల్డ్ పర్యటనలు, పారదర్శకత మరియు కఠినమైన జవాబుదారీతనంతో జిల్లా పాలనా యంత్రంగం రూపురేఖలను మార్చివేశారు. అధికారాన్ని కేవలం సమీక్షా సమావేశాలు, ఏసీ గదుల సమీక్షలకే పరిమితం చేయకుండా…

Read More

ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు తెలంగాణ సమాయత్తం.. ఒలింపిక్ భవన్‌లో సన్నాహక సమావేశం!

హైదరాబాద్: తెలంగాణ వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్ (Khelo India Youth Games) నిర్వహణ మరియు తెలంగాణ క్రీడాకారుల సన్నాహకాలపై బుధవారం హైదరాబాద్‌లోని ఒలింపిక్ భవన్‌లో కీలక సన్నాహక సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి, క్రీడా వ్యవహారాల సలహాదారు మరియు తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ (TOA) అధ్యక్షుడు ఏ.పి. జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (SATG) వైస్ చైర్‌పర్సన్ & మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్…

Read More

భారీ నుంచి అతి భారీ వర్షాలు.. నిర్మల్ జిల్లాలో నేడు అన్ని పాఠశాలలకు సెలవు

విద్యార్థుల భద్రత దృష్ట్యా ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటింపు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు జిల్లా యంత్రాంగం హెచ్చరిక వాగులు, వంకలు, చెరువులు, లోతట్టు ప్రాంతాల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచన నిర్మల్, జూలై 30: E6 tv NEWS (Md, అమీనుద్దీన్). నిర్మల్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ నేడు జిల్లాలోని…

Read More

రాత్రి వరకు తెలంగాణపై డిప్రెషన్ ప్రభావం.. ఉత్తర తెలంగాణకు భారీ వర్షాల హెచ్చరిక!

తదుపరి 12-18 గంటలు ఆదిలాబాద్ నిజామాబాద్ సహా పలు జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉత్తర తెలంగాణలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణుల సూచన.. హైదరాబాద్, జూలై 30: (E6 tv NEWS: ప్రతినిధి).తెలంగాణ రాష్ట్రంపై కొనసాగుతున్న డిప్రెషన్ ప్రభావం రాత్రి వరకు కొనసాగనున్నట్లు వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రాబోయే 12 నుంచి 18 గంటలు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. గడిచిన 24 గంటల్లో…

Read More

ఎడతెరిపి వర్షాలకు పెంకుటిల్లు కూలిన ఘటన

అదృష్టవశాత్తూ ప్రాణనష్టం లేదు.. బాధిత కుటుంబానికి ప్రభుత్వ సాయం అందించాలని గ్రామస్థుల విజ్ఞప్తి మద్నూర్, జూలై 29: (E6 tv NEWS: ప్రతినిధి)ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సుల్తాన్‌పేట్ గ్రామంలో ఓ పెంకుటిల్లు బుధవారం కుప్పకూలింది. గ్రామానికి చెందిన సరడే హన్మంత్ (తండ్రి: మైసజీ) నివాసముంటున్న ఇల్లు వర్షం ధాటికి పూర్తిగా నేలమట్టమైంది. ఇంటి పైకప్పు ఒక్కసారిగా కూలిపోవడంతో ఇంట్లోని గృహోపకరణాలు, ఇతర సామగ్రి ధ్వంసమయ్యాయి.అయితే, గత వారం రోజుల…

Read More

మెదక్‌లో వర్షాల ఉధృతి: మంజీరకు వరద.. ఓవర్‌ఫ్లో అవుతున్న ఘనపూర్ ఆనకట్ట!

మెదక్: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మెదక్ జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లపైకి నీరు చేరడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడి సాధారణ జనజీవనం స్తంభించింది. హవేలి ఘనపూర్ మండలంలోని ధూప్ సింగ్ తండా వాగు తీవ్ర రూపం దాల్చడంతో చుట్టుపక్కల గ్రామాలకు రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. అంతేకాకుండా, గిరిజన తండాల్లో నిన్నటి నుండి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆనందంలో ఆయకట్టు రైతులు: ఒకవైపు…

Read More

సంస్కృత సాహిత్యానికి మూలపురుషుడు వేదవ్యాసుడు

వ్యాసపూర్ణిమ సందర్భంగా మద్నూరు గురుకులంలో ఘనంగా కార్యక్రమం వేదవ్యాసుని జీవితం, సాహిత్యంపై విద్యార్థులకు అవగాహన కల్పించిన డా. బి. వెంకట్. సంస్కృత  శ్లోకాలు, ప్రతిజ్ఞతో ఆకట్టుకున్న కార్యక్రమం మద్నూరు, జూలై 29: E6 tv NEWS (M. మస్నాజీ) సంస్కృత సాహిత్యానికి, అనంతమైన వైదిక వాఙ్మయానికి మూలపురుషుడు మహర్షి వేదవ్యాసుడేనని సంస్కృతభాషా ప్రచార సమితి నిజామాబాద్–ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ పద్యకవి డా. బి. వెంకట్ పేర్కొన్నారు.సంస్కృతభాషా ప్రచార సమితి, సంస్కృతభాషా పరిరక్షణ సమితి,…

Read More

భారీ వర్ష సూచన.. TGSPDCL విద్యుత్ శాఖ హై అలర్ట్, యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలకు ఆదేశం!

హైదరాబాద్: రాబోయే కొన్ని రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) అత్యంత అప్రమత్తమైంది. విద్యుత్ శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది అందరూ హై అలర్ట్ (High Alert) లో ఉండాలని TGSPDCL ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (CMD) జితేష్ వి. పాటిల్ ఆదేశించారు. మింట్ కాంపౌండ్ నుంచి బుధవారం చీఫ్ ఇంజనీర్లు (CEs), సూపరింటెండింగ్ ఇంజనీర్లు…

Read More

తల్లిదండ్రులు జన్మనిస్తే.. గురువులు జీవితానికి అర్థాన్ని ఇస్తారు: గురు పౌర్ణమి వేళ సీఎం రేవంత్ రెడ్డి సందేశం!

హైదరాబాద్: గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు, ఆధ్యాత్మిక గురువులకు, అధ్యాపక లోకానికి బుధవారం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (X) వేదికగా సీఎం సందేశాన్ని పంచుకుంటూ.. గురు పౌర్ణమి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, మన జీవితాలను దిద్ది తీర్చిదిద్దిన గురువులకు కృతజ్ఞతలు తెలుపుకునే పవిత్రమైన రోజని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సందేశంలోని ముఖ్యాంశాలు: సమాజ నిర్మాణంలో, భవిష్యత్ తరాలను…

Read More

అర్హులైన ధూంధాం కళాకారులకు ఉద్యోగాలు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలి

ఓట్యాట్‌పల్లిలో ఘనంగా తెలంగాణ ధూంధాం కళాకారుల బోనాల జాతర, తెలంగాణ ఉద్యమ కళాకారుల త్యాగాలను ప్రభుత్వం గుర్తించాలని విజ్ఞప్తి మాక్లూర్, జూలై 29:E6 tv NEWS (శివ ఠాకూర్).తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అర్హులైన ధూంధాం కళాకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలు, ఇండ్ల స్థలాలు వెంటనే కేటాయించాలని తెలంగాణ ధూంధాం నిజామాబాద్ జిల్లా కళాకారుల వేదిక నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం మాక్లూర్ మండలం ఓట్యాట్‌పల్లి గ్రామంలోని ఒడ్డేటవ్వ ఆలయం వద్ద జిల్లా…

Read More