దసరా నాటికి విజయవాడకు ‘వందే భారత్ స్లీపర్’ రైళ్లు: విమాన ప్రయాణ అనుభూతిని అందించనున్న నూతన సర్వీసులు!
విజయవాడ: దీర్ఘకాలిక ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ తీపి కబురు అందించింది. ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ చైర్ కార్ సర్వీసులను మరింత ఆధునీకరిస్తూ.. త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావడానికి రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. రాబోయే దసరా పండుగ నాటికి విజయవాడ డివిజన్‌లో ఈ స్లీపర్ రైళ్లను ప్రారంభించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. విమాన స్థాయి వసతులు.. 160 కి.మీ వేగం! విమాన ప్రయాణానికి ధీటుగా అత్యున్నత ప్రపంచ స్థాయి వసతులతో ఈ…

