హైదరాబాద్: తెలంగాణలోని మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్స్జెండర్లకు (ట్రాన్స్జెండర్ వ్యక్తులు) కో-ఆప్టెడ్ సభ్యులుగా అవకాశం కల్పించే ‘తెలంగాణ మున్సిపాలిటీల (నాలాగో సవరణ) బిల్లు–2026’ కు రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరఫున శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు ఈ కీలక బిల్లును సభలో ప్రవేశపెట్టారు.
హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) మినహా, రాష్ట్రంలోని తొమ్మిది మున్సిపల్ కార్పొరేషన్లలో ఒక్కో ట్రాన్స్జెండర్ను కో-ఆప్టెడ్ మెంబర్గా నామినేట్ చేయడానికి ఈ చట్ట సవరణ వీలు కల్పిస్తుంది. సమాజంలో వివక్షకు గురవుతున్న ట్రాన్స్జెండర్లను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడం, స్థానిక పాలన మరియు నిర్ణయాధికారంలో వారికి భాగస్వామ్యం కల్పించడమే ఈ నిర్ణయ ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు. ఈ బిల్లుకు బిజెపి, సిపిఐ సహా ప్రతిపక్ష సభ్యులు కూడా పూర్తి మద్దతు ప్రకటించారు.

