హైదరాబాద్: తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు తెలిపారు. గత రెండేళ్ల కాలంలో (2025 మరియు 2026) వివిధ దేశీయ, అంతర్జాతీయ సంస్థలు మరియు పారిశ్రామికవేత్తలతో కలిపి మొత్తం 108 అవగాహన ఒప్పందాలు (MoUs) కుదుర్చుకున్నట్లు శాసనసభలో వెల్లడించారు.
శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ.. ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’, ‘బయోసియా’ (BioAsia) వంటి అంతర్జాతీయ వేదికలు మరియు రోడ్‌షోల ద్వారా పెట్టుబడులను పెద్దఎత్తున ఆహ్వానిస్తున్నామని చెప్పారు. రైజింగ్ గ్లోబల్ సమిట్‌లో కుదుర్చుకున్న 75 ఒప్పందాలలో ఇప్పటికే 23 శాతం (17 ప్రాజెక్టులు) ఉత్పత్తులను ప్రారంభించాయని తెలిపారు. అలాగే దావోస్ పర్యటనల్లో చేసుకున్న ఒప్పందాలలో దాదాపు 45 శాతం ప్రాజెక్టులు ఇప్పటికే పట్టాలెక్కాయని వివరించారు. పరిశ్రమల స్థాపనకు సింగిల్ విండో అనుమతులు, ప్రత్యేక నోడల్ అధికారులతో సమర్థవంతమైన పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

