న్యూఢిల్లీ: 18వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశానికి చేరుకున్నారు. న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న పుతిన్‌కు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఘనంగా స్వాగతం పలికారు.
ఈ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో వ్లాదిమిర్ పుతిన్ కీలక ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొననున్నారు. భారత్-రష్యా మధ్య రక్షణ, ఇంధనం, వాణిజ్యం మరియు వ్యూహాత్మక సంబంధాల బలోపేతంపై ఇరు నాయకులు చర్చించనున్నారు.
ఈ బ్రిక్స్ సదస్సు వేదికగా అంతర్జాతీయ పరిణామాలు, ప్రపంచ ఆర్థిక సహకారం మరియు కీలక రాజకీయ అంశాలపై ప్రపంచ దేశాల నాయకుల మధ్య విస్తృత చర్చలు జరగనున్నాయి.

