Breaking News

సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలో ‘వన్‌ వార్డ్ ఎవ్రీ డే’.. నిజాంపేట్‌లో పర్యటించిన కమిషనర్ శ్రీజన!

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) పరిధిలోని ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చేపట్టిన ‘వన్‌ వార్డ్ ఎవ్రీ డే’ (One Ward Every Day) కార్యక్రమంలో భాగంగా బుధవారం కమిషనర్ జి. శ్రీజన నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని వార్డులో విస్తృతంగా పర్యటించారు.

ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, కాలనీ సంక్షేమ సంఘాల (RWA) ప్రతినిధులతో కమిషనర్ ప్రత్యేకంగా ముఖాముఖి నిర్వహించి, వార్డు పరిధిలోని పౌర సమస్యలు మరియు జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష జరిపారు.

చర్చించిన ప్రధాన సమస్యలు:

  • డ్రైనేజీ & మ్యాన్‌హోల్స్: దెబ్బతిన్న మ్యాన్‌హోళ్ల మరమ్మతులు, మురుగునీటి డ్రైనేజీ అవరోధాలను (Drainage blockages) వెంటనే తొలగించడం.
  • రహదారుల అభివృద్ధి: గోకరాజు రోడ్డు పునరుద్ధరణ, రోడ్ల విస్తరణ, గుంతల పూడ్చివేత మరియు నీటి నిల్వ సమస్యలను నివారించడం.
  • వీధి దిపాలు & చెత్త సేకరణ: వీధిదీపాల సమస్యలు, డోర్-టు-డోర్ చెత్త సేకరణ సమర్థవంతంగా నిర్వహించడం, రోడ్ల ఊడ్చివేత (Road sweeping) ను వేగవంతం చేయడం.
  • ఎఫ్‌ఓబీ (FOB) నిర్మాణం & ఆక్రమణలు: బెవర్లీ పామ్స్ సమీపంలో పదాచారుల కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ (Foot Over Bridge) ఏర్పాటు మరియు ఆక్రమణల తొలగింపు.
  • ఎస్టీపీ స్లడ్జ్ నిర్మూలన: ఎస్‌టీపీ (STP) స్లడ్జ్‌ను శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేసి తొలగించడం.

కమిషనర్ ఆదేశాలు:

ప్రజలు మరియు నివాస సంఘాల ప్రతినిధులు లేవనెత్తిన ప్రతి సమస్యపై ఆయా సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, ఇతర ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని కార్పొరేషన్ కమిషనర్ జి. శ్రీజన అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *