Breaking News

బ్రిక్స్ సదస్సు వేళ కాంగ్రెస్‌లో భిన్న స్వరాలు

న్యూఢిల్లీ: భారత్ ఆతిథ్యంలో 18వ ‘బ్రిక్స్’ (BRICS) శిఖరాగ్ర సదస్సు ప్రారంభం కానున్న తరుణంలో, ఈ కూటమి వల్ల దేశానికి కలిగే ప్రయోజనాలపై కాంగ్రెస్ పార్టీలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బ్రిక్స్ వల్ల భారత్‌కు చేకూరిన స్పష్టమైన ప్రయోజనాలేమిటని సీనియర్ నేత పి. చిదంబరం ప్రశ్నించగా, మరో ఎంపీ శశి థరూర్ ఆ వ్యాఖ్యలను తోసిపుచ్చుతూ కూటమి ప్రాధాన్యతను సమర్థించారు.

ప్రపంచ జనాభాలో అత్యధిక వాటాతో పాటు గ్లోబల్ జీడీపీలో 41 శాతం వాటా కలిగి ఉన్న 11 దేశాల బ్రిక్స్ కూటమి, గ్లోబల్ సౌత్ ప్రాంతానికి అత్యంత ముఖ్యమైన వేదికని శశి థరూర్ పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కీలక దేశాధినేతలను ఒకే చోటికి తీసుకురావడం భారత్ సాధించిన దౌత్యపరమైన విజయమని అభిప్రాయపడ్డారు. 2026 సంవత్సరానికి గాను భారత్ అధ్యక్షతన “స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత” అనే థీమ్‌తో ఈ సదస్సు రెండు రోజుల పాటు జరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *