హైదరాబాద్:
దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మళ్లీ రికార్డు స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో వరుసగా పెరుగుతున్న పసిడి ధరలు కొనుగోలుదారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ఒక్కరోజులోనే 24 క్యారెట్ల (మేలిమి బంగారం) 10 గ్రాముల ధర ఏకంగా రూ.1,310 మేర పెరిగి రూ.1,56,660కి చేరింది. అదే సమయంలో ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,200 ఎగబాకి రూ.1,43,600 వద్ద ట్రేడ్ అవుతోంది. గడిచిన రెండు రోజుల వ్యవధిలోనే 10 గ్రాముల బంగారంపై రూ.4,640 వరకు ధర పెరగడం గమనార్హం.
ముఖ్యాంశాలు:
- 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,310 పెరుగుదలతో రూ.1,56,660కి చేరింది.
- 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,200 పెరుగుదలతో రూ.1,43,600 వద్దకు చేరింది.
- రెండు రోజుల్లో మార్పు: 10 గ్రాముల బంగారం పై రూ.4,640 వరకు భారీ బాదుడు.
- కారణాలు: అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న మార్పులు, స్థానిక డిమాండ్ పెరగడంతోనే పసిడి పరుగులు పెడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.
పెళ్లిళ్ల సీసన్, పండుగలు సమీపిస్తుండటంతో బంగారం ధరలు నింగినంటుతుండటంతో సామాన్య వినియోగదారులు షాక్కు గురవుతున్నారు.

