Breaking News

ఎస్‌ఐఆర్‌పై ప్రజలకు అవగాహన కల్పించిన నిర్మల్ రూరల్ ఎంఆర్‌ఓ రాజు

నిర్మల్,ఆగస్టు 28:(E6tv NEWS: ప్రతినిధి).
ఎస్‌ఐఆర్‌ (ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ) ప్రక్రియపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేసేందుకు నిర్మల్ రూరల్ ఎంఆర్‌ఓ రాజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం వైయస్సార్ కాలనీలో పర్యటించిన ఆయన స్థానిక ప్రజలకు ఎస్‌ఐఆర్ ప్రక్రియపై వివరించారు.

నోటీసులకు ఆధారాలు జత చేయాలి

ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న ప్రతి ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎంఆర్‌ఓ రాజు తెలిపారు. నోటీసుతో పాటు తమ వద్ద ఉన్న సంబంధిత ఆధారాలను జత చేసి, తమ వార్డుకు సంబంధించిన బీఎల్‌ఓ (BLO)కు అందజేయాలని సూచించారు.

కంగారు పడాల్సిన అవసరం లేదు

ప్రజలు భయపడకుండా, కంగారు పడకుండా నోటీసులు అందుకున్న వారు రెండు, మూడు రోజుల్లో తమ వార్డులోని బీఎల్‌ఓను సంప్రదించి అవసరమైన ఆధారాలను సమర్పించాలని ఎంఆర్‌ఓ కోరారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు.ఈ అవగాహన కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొని ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన పలు అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *