హనుమకొండ: తెలంగాణ మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ (OSD) ఎన్. సుమంత్ తండ్రి సుబ్రహ్మణ్యం (రైతు/మాజీ విద్యుత్ శాఖ ఉద్యోగి) శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తన కుటుంబంపై జరుగుతున్న దుష్ప్రచారం, తన కుమారుడు సుమంత్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు విచారణల వల్ల తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన పెద్దమొత్తంలో కామ్పోజ్ (Calmpose) మాత్రలు మింగారు.
హనుమకొండలోని రామ్‌నగర్‌లోని నివాసంలో ఉదయం స్పృహతప్పి పడి ఉన్న సుబ్రహ్మణ్యాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వరంగల్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అబ్డామిన్ స్కాన్ చేసిన వైద్యులు ఆయన కడుపులో భారీగా నిద్రమాత్రలు ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

