మియాపూర్‌లో వృద్ధుడు డ్రెయిన్‌లో పడి గల్లంతు: సుమోటోగా స్వీకరించిన తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC)!
హైదరాబాద్: హైదరాబాద్‌లోని మియాపూర్ వైశాలీనగర్ రైల్వే బ్రిడ్జి సమీపంలో మూసివేయని డ్రెయిన్ పనుల వద్ద ఒక 75 ఏళ్ల వృద్ధుడు ప్రమాదవశాత్తూ తెరిచి ఉన్న నాలాలో పడి గల్లంతైన ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TGHRC) తీవ్రంగా స్పందించింది. వార్తాపత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా టీజీహెచ్‌ఆర్‌సీ ఛైర్‌పర్సన్ జస్టిస్ డాక్టర్ షమీమ్ అఖ్తర్ ఈ వ్యవహారాన్ని సుమోటోగా (Suo-Motu) స్వీకరించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సురక్షితంకాని డ్రెయిన్లు, తెరిచి ఉన్న నాలాల వల్ల పదే…

