అమెరికాలో విషాదం: పుట్టినరోజే నిర్మల్ యువకుడి మృతి!
నిర్మల్: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన నిర్మల్ జిల్లా యువకుడు రోడ్డు ప్రమాదంలో గాయపడి, సరిగ్గా తన పుట్టినరోజే ఆసుపత్రిలో కన్నుమూశాడు. ఈ దారుణ ఘటన జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుడిని నిర్మల్ జిల్లా లక్ష్మణచందా మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన నిత్యానంద రెడ్డి (24) గా గుర్తించారు. ఘటన వివరాలు: ఎంతో భవిష్యత్తు ఉన్న కొడుకు పుట్టినరోజే మరణించాడని తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. నిత్యానంద రెడ్డి భౌతికకాయాన్ని వీలైనంత…

