ఈ ఖరీఫ్‌లో ‘వరి’ వేస్తే నీళ్లివ్వలేం.. ప్రత్యామ్నాయ పంటలే శ్రేయస్కరం: ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్ ఘన్‌పూర్ / వరంగల్: రాష్ట్రంలో సాగునీటి కొరత రైతులకు తీరని ఆందోళన కలిగిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి రంగాన్ని నిర్వహించడంలో విఫలమైందని, ఎల్ నినో ప్రభావంతో వర్షాలు పడకపోవడమే ఇందుకు కారణమని వస్తున్న విమర్శలకు తోడు ప్రజాప్రతినిధుల వ్యాఖ్యలు రైతాంగాన్ని మరిన్ని కష్టాల్లోకి నెడుతున్నాయి. ఈ ఖరీఫ్ (వానాకాలం) సీజన్‌లో వరి పంటకు నీరందిస్తామని తాను గ్యారెంటీ ఇవ్వలేనని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. రైతులు ఆతురతపడి వరి వేసి నష్టపోవద్దని,…

