Breaking News

Shiv Thakur

ముత్యాలమ్మ తల్లి ఆలయంలో మహా అన్నదానం

పాల్వంచ, సెప్టెంబర్ 12:(E6tv NEWS: ప్రతినిధి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో నెల రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించిన పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ముగిశాయి. ఈ సందర్భంగా శనివారం ఆలయ ప్రాంగణంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. 44వ డివిజన్ కార్పొరేటర్ వీసంశెట్టి విశ్వేశ్వరరావు, ఆయన సతీమణితో కలిసి మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ…

Read More

కృష్ణానదిపై మట్టపల్లి నిమజ్జన ఘాట్‌ను పరిశీలించిన అధికారులు

మఠంపల్లి, సెప్టెంబర్ 12:(E6tv NEWS: ప్రతినిధి) సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని కృష్ణానదిపై మట్టపల్లి బ్రిడ్జి వద్ద సెప్టెంబర్ 14 నుంచి 25 వరకు నిర్వహించనున్న వినాయక నిమజ్జన కార్యక్రమాల నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. శనివారం హుజూర్‌నగర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గజ్జె చరమంద రాజు ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం అధికారులు మట్టపల్లి బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేయనున్న నిమజ్జన ఘాట్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ…

Read More

నిజాంసాగర్‌లో విద్యుత్ కోతలపై రైతుల ధర్నా

రోజుకు ఐదారు గంటలే విద్యుత్ సరఫరాపంటలకు నీరందక ఎండిపోయే పరిస్థితి24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ నిజాంసాగర్, సెప్టెంబర్ 12:(E6tv NEWS: ప్రతినిధి). మండలంలో విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులు జాతీయ రహదారి 161పై ధర్నా చేపట్టారు. వ్యవసాయానికి అవసరమైన స్థాయిలో విద్యుత్ సరఫరా కావడం లేదని, రోజుకు కేవలం ఐదారు గంటలు మాత్రమే విద్యుత్ వస్తుండటంతో మోటార్లు సక్రమంగా పనిచేయడం లేదని రైతులు పేర్కొన్నారు. అప్పులు…

Read More

తనిఖీల పేరుతో రైస్ మిల్లర్లను వేధించొద్దు

తనిఖీల పేరుతో రైస్ మిల్లర్లను వేధించొద్దు మిల్లింగ్ ఛార్జీ క్వింటాల్‌కు రూ.150కు పెంచాలి పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలినిజామాబాద్‌లో రైస్ మిల్లర్ల ధర్నా నిజామాబాద్, సెప్టెంబర్ 12:(E6tv NEWS: శివ ఠాకూర్).తనిఖీల పేరుతో నిజాయితీగా పనిచేస్తున్న రైస్ మిల్లర్లను వేధించవద్దని నిజామాబాద్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్, ది నిజామాబాద్ డిస్ట్రిక్ రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేశాయి. మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిజామాబాద్ ధర్నాచౌక్‌లో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా…

Read More

ఇల్లెందు ఆర్టీసీ బస్టాండ్‌లో షార్ట్ సర్క్యూట్

తప్పిన పెను ప్రమాదం.. పలు రికార్డులు, ఫర్నిచర్ దగ్ధం ఇల్లెందు, సెప్టెంబర్ 12:(E6tv NEWS: ప్రతినిధి) ఇల్లెందు ఆర్టీసీ బస్టాండ్‌లో శుక్రవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగడంతో కలకలం రేగింది. బస్టాండ్ ఆవరణలోని కంట్రోలర్ గదిలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ సంభవించి మంటలు వ్యాపించాయి. అయితే ఘటన సమయంలో గదిలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో కంట్రోలర్ గదిలో ఉన్న పలు రికార్డులు, ఫర్నిచర్, విద్యుత్ పరికరాలు పూర్తిగా దగ్ధమైనట్లు తెలిసింది….

Read More

భీంగల్ కొత్త బస్టాండ్‌లో కంట్రోలర్ లేక ప్రయాణికుల ఇబ్బందులు

బస్సుల రాకపోకలు ఎక్కువగా ఉన్నా పట్టించుకోని ఆర్టీసీ అధికారులు సమయాలు తెలియక ప్రయాణికుల అవస్థలు భీంగల్, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి) భీంగల్ పట్టణంలోని కొత్త బస్టాండ్‌లో కంట్రోలర్‌ను ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్‌లో రోజూ పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ, బస్సుల సమయాలు, రాకపోకల వివరాలు తెలుసుకునేందుకు కంట్రోలర్ అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారు. భీంగల్ కొత్త బస్టాండ్ నుంచి వేల్పూర్,…

Read More

బోధన్‌లో 250 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

లారీ డ్రైవర్‌పై కేసు నమోదు బోధన్, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి) బోధన్ టౌన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 250 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా బియ్యం లోడ్‌తో వెళ్తున్న లారీని (TS16UB3690) అనుమానంతో ఆపి తనిఖీ చేశారు. లారీలో 523 బస్తాల బియ్యం ఉండగా, వాటికి సంబంధించి ఎలాంటి అనుమతి పత్రాలు, రవాణా పత్రాలు డ్రైవర్ వద్ద లేకపోవడంతో లారీని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సివిల్ సప్లైస్ అధికారులకు…

Read More

సోమూర్‌లో ఘనంగా ఎడ్ల అమావాస్య వేడుకలు

ఎద్దులను అలంకరించి పూజలు నిర్వహించిన కాశినాథ్ పటేల్ కుటుంబం మద్నూర్, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి) మండలంలోని సోమూర్ గ్రామంలో ఎడ్ల అమావాస్య (పొలాల పండుగ)ను కాశినాథ్ పటేల్ కుటుంబ సభ్యులు సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. వ్యవసాయంలో రైతులకు తోడుగా నిలిచే ఎద్దులను రంగురంగుల వస్త్రాలు, తోరణాలు, వివిధ అలంకరణలతో ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎద్దులకు ఆరోగ్యం, రైతులకు పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని పూజలు చేశారు. వ్యవసాయంతో విడదీయరాని అనుబంధం కలిగిన…

Read More

మానవతా దృక్పథం చాటిన ఎస్పీ నరసింహ

MBBS సీటు సాధించిన నిరుపేద విద్యార్థినికి రూ.20 వేల ఆర్థిక సహాయం సూర్యాపేట, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి) పేదరికం లక్ష్యానికి అడ్డంకి కాదని, పట్టుదలతో కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ అన్నారు. పెన్‌పహాడ్ మండలం అనంతారం గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థిని మామిడి ఇందు NEETలో మంచి ర్యాంక్ సాధించి గాంధీ మెడికల్ కాలేజీలో MBBS సీటు పొందడంతో ఆమెకు తన వంతు సహాయంగా రూ.20…

Read More

డాక్టర్ శ్రీనివాసరెడ్డిని సత్కరించిన కొత్వాల

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీలను బర్తరఫ్ చేయాలి కొత్తగూడెం, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి) రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, కొత్తగూడెం నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్‌చార్జి డాక్టర్ మద్ది శ్రీనివాసరెడ్డిని డీసీఎంఎస్ మాజీ చైర్మన్, పాల్వంచ సొసైటీ అధ్యక్షుడు కొత్వాల శ్రీనివాసరావు ఘనంగా సత్కరించారు. డాక్టర్ శ్రీనివాసరెడ్డి కొత్తగూడెం వచ్చిన సందర్భంగా శుక్రవారం విద్యానగర్‌లోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ…

Read More