Breaking News

Shiv Thakur

బాల్కొండలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

బాల్కొండ ఆగస్టు 15: (E6tv NEWS: T. గంగాధర్). బాల్కొండ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించిన అనంతరం దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులు, త్యాగధనులను ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్మరించుకున్నారు. వారి త్యాగాలను దేశ…

Read More

ఎర్గట్ల మండలంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

ఎర్గట్ల, ఆగస్టు 15: (E6tv NEWS: T. గంగాధర్). నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎర్గట్ల మండలానికి చెందిన ఇద్దరు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎర్గట్ల గ్రామానికి చెందిన శ్రీమతి జుంగాల గంగు, శ్రీమతి హుస్సేన్ బీకి వేదికపై స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎర్గట్ల తహసీల్దార్, డిప్యూటీ…

Read More

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ శ్రీకాంత్

మలాపూర్ గ్రామంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు డోంగ్లీ ఆగస్టు 15: (E6tv NEWS: ప్రతినిధి). కామారెడ్డి జిల్లా డోంగ్లీ మండలం మలాపూర్ గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శ్రీకాంత్ జాతీయ జెండాను ఆవిష్కరించి, గ్రామ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. దేశ అభివృద్ధి, ఐక్యత…

Read More

తోట వారి వివాహ విందుకు మేనూర్ గ్రామ ప్రజలకు సాదర ఆహ్వానం

కందర్పల్లి DBL గ్రౌండ్‌లో ఆగస్టు 16న వివాహ విందు మేనూర్, ఆగస్టు 15: (E6tv NEWS: ప్రతినిధి). జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు గారి కుమార్తె వివాహ విందు కార్యక్రమానికి మేనూర్ గ్రామ ప్రజలందరూ హాజరై వధూవరులను ఆశీర్వదించాలని పటేల్ గ్రామ సర్పంచ్ అశోక్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ అశోక్ మాట్లాడుతూ.. ఆగస్టు 16వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు కందర్పల్లి–బిచ్కుంద రోడ్డులోని DBL గ్రౌండ్‌లో తోట వారి వివాహ…

Read More

వివాహ విందు వేడుకకు సాదర ఆహ్వానం

బిచ్కుంద, ఆగస్టు 15: (E6tv NEWS: ప్రతినిధి). )జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు ఆధ్వర్యంలో నిర్వహించనున్న వివాహ విందు వేడుకకు కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ఇతర పార్టీలకు చెందిన సహచర మిత్రులందరికీ సాదర ఆహ్వానం పలికారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తన కార్యకర్తలందరూ, ఇతర పార్టీలకు చెందిన సహచర మిత్రులందరూ ఈ ఆహ్వానాన్నే తమ ఆహ్వానంగా భావించి, పెద్ద మనసుతో శుభ కార్యక్రమానికి విచ్చేసి వధూవరులను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరారు. వివాహ విందు వివరాలు:📅…

Read More

జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

దేశ ఐక్యత, అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలి: జుక్కల్ ఎమ్మెల్యే జుక్కల్ ఆగస్టు 15: (E6tv NEWS: ప్రతినిధి). జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. దేశ ఐక్యత, సమగ్ర అభివృద్ధి కోసం ప్రజలంతా కలిసికట్టుగా…

Read More

మద్నూర్ ఎంపీడీవోగా పి. సాయిలు బాధ్యతలు

మద్నూర్, ఆగస్టు 15:(E6tv NEWS: ప్రతినిధి). మద్నూర్ మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారిగా (ఎంపీడీవో) పి. సాయిలు బాధ్యతలు స్వీకరించారు. వేల్పూర్ మండలంలో విధులు నిర్వహించిన ఆయన పదోన్నతిపై మద్నూర్ ఎంపీడీవోగా నియమితులయ్యారు.ఇప్పటివరకు మద్నూర్ ఇన్‌చార్జి ఎంపీడీవోగా విధులు నిర్వహించిన సత్యనారాయణరెడ్డి నుంచి స్వాతంత్ర్య దినోత్సవం రోజున పి. సాయిలు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో పి. సాయిలు జాతీయ జెండాను ఆవిష్కరించి 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా…

Read More

ఉత్తమ సేవల అవార్డు అందుకున్న మద్నూర్ కానిస్టేబుల్ విట్టల్

మద్నూర్ ఆగస్టు 15: (E6tv NEWS: ప్రతినిధి). ఉత్తమ సేవలు అందించినందుకు మద్నూర్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ విట్టల్‌కు ప్రశంసా పత్రం లభించింది. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ నవీన్ చంద్ర చేతుల మీదుగా విట్టల్ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఇటీవల జరిగిన దారి దోపిడీ కేసులో నిందితులను గుర్తించడంలో కానిస్టేబుల్ విట్టల్ కీలకంగా వ్యవహరించారు. అలాగే మద్నూర్ మండల…

Read More

వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ

మద్నూర్, ఆగస్టు 15: (E6tv NEWS: ప్రతినిధి).మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.అనంతరం గాంధీ చౌక్ ఆవరణలో గ్రామ పెద్దలు, వ్యాపారవేత్తల కుటుంబాలకు చెందిన మహిళామణుల ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటే కార్యక్రమాలు నిర్వహించారు. కార్మెల్ ప్రైవేట్ స్కూల్ విద్యార్థినులు ప్రదర్శించిన ఆకట్టుకునే నృత్య ప్రదర్శనలు…

Read More

విధి నిర్వహణలో ప్రతిభకు గుర్తింపు

TSNPDCL ఏఈ సంజీవ్ కుమార్‌కు ప్రశంసా పత్రం నిర్మల్ ఆగస్టు 15: (E6 tv NEWS ప్రతినిధి). నిర్మల్ జిల్లా కేంద్రంలోని కాలేజ్ మైదానంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బిపేష్ మిశ్రా, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా వివిధ శాఖల్లో విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను అధికారులు సన్మానించారు. ఇందులో భాగంగా TSNPDCLలో ఏఈగా…

Read More