ఏపీలో నెల రోజుల్లో పీపీపీ మెడికల్ కాలేజీల పనులు ప్రారంభం: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య విద్య, ప్రజారోగ్య రంగాల్లో పెనుమార్పులు తెచ్చేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీపీపీ (PPP) విధానంలో చేపట్టే మెడికల్ కాలేజీల పనులను నెల రోజుల్లోపు పట్టాలెక్కించాలని అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో జరిగిన సంజీవని ప్రాజెక్టు, పాపులేషన్ మేనేజ్‌మెంట్ సమీక్షా సమావేశంలో ఆయన ఈ దిశగా దిశానిర్దేశం చేశారు.రెండు దశల్లో 10 మెడికల్ కాలేజీల నిర్మాణంరాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని రెండు దశల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం…

