Karimnagar
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు
ఆగస్టు 2: (E6 tv NEWS ప్రతినిధి). తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతి రెడ్డి, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్‌పల్లి నగేష్ రెడ్డి, రాష్ట్ర పీఏసీ కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే…
నిజామాబాద్ ‘ఊర పండుగ’ – తెలంగాణ జానపద సంస్కృతికి ప్రతీక
ఇందూరు ఆగస్టు 2: E6 tv NEWS (శివ ఠాకూర్). నిజామాబాద్, ఆగస్టు 2: తెలంగాణ జానపద సంస్కృతి, గ్రామదేవతల ఆరాధన, సర్వ సమాజ్ ఐక్యతకు ప్రతీకగా నిలిచే నిజామాబాద్ (ఇందూర్) ఊర పండుగను ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల రోజునే జరిగే ఈ ఉత్సవం శతాబ్దాల చరిత్రను కలిగి ఉండి, నగర ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసం, సామాజిక ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తోంది. ఊర పండుగ…
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గోడ గడియారాల పంపిణీ
జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ చేతుల మీదుగా పంపిణీ ప్రతి అర్హ కుటుంబానికి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి జుక్కల్ ఆగస్టు 1: (E6 tv NEWS ప్రతినిధి). కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 100 శాతం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి గృహప్రవేశం చేసిన లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న గోడ గడియారాల పంపిణీ కార్యక్రమం శనివారం…
ఇల్లు కూల్చివేస్తామని ఆరోపిస్తూ గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట మహిళ ధర్నా
సర్పంచ్‌పై కక్ష సాధింపు ఆరోపణలు ఎంపీడీవో హామీతో విరమించిన ఆందోళన మద్నూర్ ఆగస్టు 1: (E6 tv NEWS, M. మస్నాజీ). కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం హండే కెల్లూర్ గ్రామంలో ఓ మహిళ తన ఇంటిని కూల్చివేస్తామని బెదిరిస్తున్నారంటూ గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట శనివారం ధర్నాకు దిగింది. సర్పంచ్‌కు ఓటు వేయలేదనే కక్షతో తనను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించింది.బాధిత మహిళ మాట్లాడుతూ, తన ఇంటిని కూల్చివేయాలని పదేపదే ఒత్తిడి తెస్తున్నారని, రాజకీయ…
పత్తి పంటలో ప్యారా విల్ట్‌పై రైతులకు అవగాహన కల్పించిన ఏఈఓ అనిల్
అంతాపూర్ గ్రామంలో పత్తి పంట పరిశీలన సరైన డ్రైనేజీ, శాస్త్రీయ నిర్వహణతో 90 శాతం వరకు మొక్కలను కాపాడవచ్చని సూచన మద్నూర్, ఆగస్ట్ 1: (E6 tv NEWS, M.మస్నాజీ) కామారెడ్డి జిల్లా అంతాపూర్ గ్రామంలో వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) అనిల్ పత్తి పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు ప్యారా విల్ట్ (Para Wilt) సమస్యపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్యారా విల్ట్ అనేది పత్తి పంటలో వచ్చే శారీరక రుగ్మత…
సాహిత్య రత్న అన్నా బహు సాటే 106వ జయంతి ఘనంగా నిర్వహణ
బిచ్కుంద మండలం శాంతాపూర్‌లో ఎంఆర్‌పీఎస్ ఆధ్వర్యంలో నివాళులు అణగారిన వర్గాల గొంతుకగా నిలిచిన మహనీయుడని కొనియాడిన నాయకులు బిచ్కుంద, ఆగస్టు1: (E6 tv NEWS, ప్రతినిధి). కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం శాంతాపూర్ గ్రామంలో సాహిత్య రత్న, లోక్ సాహిర్ అన్నా బహు సాటే 106వ జయంతిని ఎంఆర్‌పీఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఎంఆర్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుసేగం భూమయ్య మాదిగ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు అన్నా బహు సాటే చిత్రపటానికి పూలమాలలు వేసి…
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే నా ధ్యేయం: బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి వేణుగోపాల్
జగిత్యాల జిల్లాలో బీఎస్పీని బలోపేతం చేస్తాం స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలే లక్ష్యమని వెల్లడి జగిత్యాల, ఆగస్టు 1: (E6 tv NEWS ప్రతినిధి). బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే తన జీవిత ధ్యేయమని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి వేణుగోపాల్ పేర్కొన్నారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా తనకు బాధ్యతలు అప్పగించిన బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రం శేఖర్, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు బొల్లంపల్లి సంపత్‌కుమార్‌కు…
సీఎం సహాయనిధితో నిరుపేదకు అండగా
రూ.5 లక్షల ఎల్‌ఓసీ లేఖను అందజేసిన ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి నిజామాబాద్, ఆగస్టు 1: (E6 tv NEWS శివ ఠాకూర్). అత్యవసర వైద్య చికిత్స అవసరమైన నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి కొండంత అండగా నిలుస్తోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి తెలిపారు. ధర్పల్లి మండలం రామడుగు గ్రామానికి చెందిన నాయిక మహేష్ అనారోగ్య సమస్యలతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శస్త్రచికిత్స కోసం రూ.5 లక్షలు అవసరమని…
ఊర పండగ నేపథ్యంలో నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆగస్టు 2న ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దారి మళ్లింపు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని పోలీసుల సూచన నిజామాబాద్, ఆగస్టు 1: (E6 tv NEWS శివ ఠాకూర్). ఊర పండగ సందర్భంగా ఆగస్టు 2న నిర్వహించే ఊరేగింపును పురస్కరించుకుని నిజామాబాద్ నగరంలో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు పోలీస్ కమిషనర్ కార్యాలయం వెల్లడించింది. ప్రజలు ట్రాఫిక్ మళ్లింపులను గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించింది. పోలీసుల వివరాల ప్రకారం,…
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందిస్తాం: ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి.
జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రెస్ క్లబ్ ప్రతినిధులు కలెక్టర్ బాధ్యతలు చేపట్టిన వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ నిజామాబాద్, ఆగస్టు 1: (E6 tv NEWS: శివ ఠాకూర్). ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు శనివారం ఉదయం ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి, జర్నలిస్టుల మిత్రుల అందరి తరఫు నుండి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య…

