Breaking News

విద్యా.. వైద్య రంగాల బలోపేతమే ధ్యేయం

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, నాణ్యమైన విద్యపై ప్రత్యేక దృష్టి పీహెచ్‌సీల్లో మందుల కొరత లేకుండా చూడాలి.. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు జుక్కల్, ఆగస్టు 28: (E6tv NEWS: ప్రతినిధి).నియోజకవర్గంలో విద్యా, వైద్య రంగాలను మరింత బలోపేతం చేసి పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే  తోట లక్ష్మీకాంత రావు అన్నారు.జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ…

Read More

పేదల సంక్షేమమే ధ్యేయం.. అర్హులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు

జుక్కల్ క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జుక్కల్, ఆగస్టు 28:(E6tv NEWS: ప్రతినిధి) పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. జుక్కల్ నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల…

Read More

రూ.30 లక్షలతో ఐకేపీ గోడౌన్ నిర్మాణానికి భూమిపూజ

మారుమూల గ్రామాల్లో ధాన్యం నిల్వకు ఉపయోగకరం – సర్పంచులు, తండా పెద్దమనుషులు మానాల, ఆగస్టు 28:(E6tv NEWS: ప్రతినిధి). ఉమ్మడి మానాల గ్రామపంచాయతీ పరిధిలోని స్కూల్ తండా గ్రామపంచాయతీలో రూ.30 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఐకేపీ గోడౌన్‌కు భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఉమ్మడి మానాల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచులు, తండా పెద్దమనుషులు, ప్రజాప్రతినిధులు కలిసి భూమిపూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాల్లో గోడౌన్ల నిర్మాణం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. కొనుగోలు…

Read More

ఏర్గట్లలో వైభవంగా జంధ్యాల పౌర్ణమి వేడుకలు

శాస్త్రోక్తంగా నూతన యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం జంధ్యాల పౌర్ణమి వేడుకలు ఏర్గట్ల, ఆగస్టు 28:(E6tv NEWS: ప్రతినిధి). బాల్కొండ నియోజకవర్గంలోని ఏర్గట్ల మండల కేంద్రంలో శ్రీ శివమార్కండేయ మాతృ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జంధ్యాల పౌర్ణమి (నూతన యజ్ఞోపవీత ధారణ) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.సమాజ శ్రేయస్సును కాంక్షిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య నూతన యజ్ఞోపవీత ధారణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ…

Read More

ముందస్తు టికెట్ బుకింగ్ సద్వినియోగం చేసుకోండి

ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజినల్ మేనేజర్ ఎస్.వి.జి. కృష్ణమూర్తి విజ్ఞప్తి నిజామాబాద్, ఆగస్టు 28:( E6tv NEWS: ప్రతినిధి). ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ అందిస్తున్న ముందస్తు టికెట్ బుకింగ్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ రీజినల్ మేనేజర్ ఎస్.వి.జి. కృష్ణమూర్తి ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.ముందస్తుగా రిజర్వేషన్ చేసుకుని టికెట్లు బుక్ చేసుకోవడం ద్వారా ప్రయాణికులు తమకు అనుకూలమైన సమయానికి సౌకర్యవంతంగా ప్రయాణించే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ప్రయాణానికి ముందుగానే టికెట్ బుక్ చేసుకోవడం వల్ల చివరి…

Read More

రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ శుభాకాంక్షలు

నిజామాబాద్, ఆగస్టు 27:(E6tv NEWS: ప్రతినిధి) రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ప్రయాణికులు తమ కుటుంబ సభ్యులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేలా టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.పండుగ నేపథ్యంలో బస్టాండ్లు, ప్రధాన రహదారులు, రద్దీ ప్రాంతాల్లో టీజీఎస్‌ఆర్టీసీ సూపర్‌వైజర్లు, ప్రత్యేక అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రయాణికుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అవసరమైన ప్రాంతాల్లో అదనపు బస్సులను ఏర్పాటు చేసి ప్రయాణికులను సురక్షితంగా వారి స్వస్థలాలకు చేరవేస్తున్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన…

Read More

అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూడాలి

కంటేశ్వర్‌లో ఓటర్లకు నోటీసులు అందజేస్తున్న విధానం పరిశీలన నిజామాబాద్, ఆగస్టు 27: అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా క్షేత్రస్థాయి సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)లో భాగంగా 2002 ఓటరు జాబితాతో మ్యాపింగ్ జరగని వారు, అలాగే పేరు, వయసు తదితర వివరాల్లో వ్యత్యాసాలు ఉన్న ఓటర్లకు హియరింగ్‌కు హాజరు కావాలని కోరుతూ బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి నోటీసులు…

Read More

భీంగల్‌లో రోడ్ల గుంతలకు మరమ్మతు చర్యలు

భీంగల్, ఆగస్టు 26:(E6tv NEWS: ప్రతినిధి). భీంగల్ మున్సిపల్ పరిధిలోని బస్టాండ్, కూరగాయల మార్కెట్ ప్రాంతాల్లో ఏర్పడిన రోడ్ల గుంతలను మున్సిపల్ అధికారులు సిబ్బందితో కలిసి పూడ్చే చర్యలు చేపట్టారు. గుంతల్లో చిప్స్‌ పోసి బ్లేడ్‌ బండితో చదును చేసి రహదారిని శుభ్రం చేశారు.ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడకుండా రోడ్లను సౌకర్యవంతంగా మార్చేందుకు ఈ పనులు చేపట్టినట్లు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బుదిరే నాగమణి స్వామి తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్‌పర్సన్‌ జైజై లత, జైజై నరసయ్య, కౌన్సిలర్లు…

Read More

జుక్కల్‌లో ఘనంగా జాష్నే ఈద్ మిలాద్-ఉన్-నబీ వేడుకలు

జుక్కల్, ఆగస్టు 26: (E6tv NEWS: ప్రతినిధి). జుక్కల్ నియోజకవర్గంలోని ముస్లిం సోదర, సోదరీమణులకు జాష్నే ఈద్ మిలాద్-ఉన్-నబీ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జుక్కల్ మండల కేంద్రంలో మిలాద్-ఉన్-నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు.జామియా మజీద్ నుంచి ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా మీదుగా ఖాతిజా మజీద్ వరకు కొనసాగింది. అనంతరం తిరిగి జామియా మజీద్‌కు చేరుకున్నారు. ర్యాలీలో మత పెద్దలు, గ్రామ యువత, చిన్నారులు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత పెద్దలు…

Read More

ఇంటెలిజెన్స్ ఎస్పీ పుల్ల కరుణాకర్‌కు ఐపీఎస్ హోదా.. ముజాహిద్ హుస్సేన్ సన్మానం

హన్మకొండ, ఆగస్టు 26:(E6tv NEWS: ప్రతినిధి). ఇంటెలిజెన్స్ ఎస్పీ పుల్ల కరుణాకర్‌కు ఐపీఎస్ హోదా కల్పిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా తెలంగాణ కమర్షియల్ టాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పుల్ల కరుణాకర్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి, స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పుల్ల కరుణాకర్ తమ…

Read More