Nizambad
ప్రైవేట్ పాఠశాలలో పాఠ్యపుస్తకాల వివాదం, ఏబీవీపీ ఆందోళన, ఎంఈఓ విచారణ
చందూరు, జూలై 2:నిజామాబాద్ జిల్లా చందూరు మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పాఠ్యపుస్తకాల నిల్వ, విక్రయాల అంశం వివాదాస్పదంగా మారింది. పాఠశాలలోనే పుస్తకాలను విక్రయించడం నిబంధనలకు విరుద్ధమని ఆరోపిస్తూ ఏబీవీపీ నాయకులు మంగళవారం పాఠశాలకు వెళ్లి నిరసన తెలిపారు. విద్యార్థి సంఘ నాయకుల కథనం ప్రకారం, పాఠశాలలోని ఓ గదిలో పెద్ద మొత్తంలో పాఠ్యపుస్తకాలు నిల్వ ఉంచినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) దృష్టికి తీసుకెళ్లగా, ఆయన అందుబాటులో లేకపోవడంతో సీఆర్పీని…
జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ XII ప్రారంభం
నిజామాబాద్, జూలై 2:(E6 క్రైమ్-శివ ఠాకూర్) నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ఆదేశాల మేరకు బుధవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్‌లో ఆపరేషన్ ముస్కాన్–XII కార్యక్రమాన్ని అదనపు డీసీపీ (అడ్మిన్) శ్రీ ఎన్. శుభం ప్రకాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 1 నుంచి జూలై 31 వరకు నెల రోజులపాటు నిర్వహించే ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా తప్పిపోయిన చిన్నారులు, నిరాశ్రయ బాలలు, వీధి…
మాదిగల సంక్షేమం కోసం సమిష్టిగా కృషి చేస్తాం: డా,పేరుమాండ్ల రామకృష్ణ
నిజామాబాద్, జూలై 1: మాదిగ హక్కుల దండోరా (ఎంహెచ్‌డీ) రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ మాదిగ ఆదేశాల మేరకు నిజామాబాద్ ఆర్ & బి గెస్ట్ హౌస్‌లో సంస్థ ముఖ్య సమావేశం నిర్వహించారు. గ్రామస్థాయి నుంచి సంస్థను బలోపేతం చేయడం, మాదిగ సమాజ హక్కుల సాధన, ఎస్సీ వర్గీకరణ అమలు, సామాజిక న్యాయం కోసం ఉద్యమాన్ని విస్తరించడంపై సమావేశంలో చర్చించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ పెరుమాండ్ల…
E6 న్యూస్ కథనానికి స్పందన, అనుమతులు లేని ఆసుపత్రి పై DMHO అధికారుల చర్యలు.
చట్టపరమైన చర్యలు తీసుకుంటారా లేదా? వేచి చూడాలి మరి. నిజామాబాద్, జూలై 1: నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని మహా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రభుత్వ అనుమతులు లేకుండానే గత రెండేళ్లుగా వైద్య సేవలు అందిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతోందంటూ E6 న్యూస్ ప్రసారం చేసిన కథనానికి అధికారులు స్పందించారు. కథనం ప్రసారమైన అనంతరం సంబంధిత శాఖ అధికారులు ఆసుపత్రిని పరిశీలించి, ఆసుపత్రికి సంబంధించిన బోర్డులు, హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలను తొలగించారు. ఈ చర్య స్థానికంగా…
మంత్రి పొన్నం ప్రభాకర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర కో-ఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి
హెడ్లైన్:
మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి
సబ్ హెడ్లైన్లు:
పెర్కిట్ రేణుక ఎల్లమ్మ ఆలయ సందర్శన సందర్భంగా శాలువాతో ఘన సత్కారం
పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్న మర్యాదపూర్వక భేటీ
నిజామాబాద్, జూలై 1:
తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పెర్కిట్‌లోని రేణుక ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, పార్టీ బలోపేతం వంటి అంశాలపై వారు స్వల్పంగా చర్చించినట్లు తెలిసింది.
ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ సభ్యుడు వేణు యాదవ్, బాల్కొండ మాజీ మండల అధ్యక్షుడు గున్నల వెంకటేష్ గౌడ్, వేల్పూర్ మండల అధ్యక్షుడు అనిల్ గౌడ్, గుమ్మిరియాల సర్పంచ్ సంజీవ్, లక్కోరా ఉప సర్పంచ్ రాము, తోర్తి సర్పంచ్ భూమేశ్వర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రవీణ్ గౌడ్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ సేవలు సమాజానికి అమూల్యం, వరల్డ్ డాక్టర్స్ డే శుభాకాంక్షలు-అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్- ఎం, సుమంత్ కుమార్.
డాక్టర్ల సేవలు సమాజానికి అమూల్యం.. వరల్డ్ డాక్టర్స్ డే శుభాకాంక్షలు: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎం. సుమంత్ కుమార్ నిజామాబాద్, జూలై 1: వరల్డ్ డాక్టర్స్ డే సందర్భంగా నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎం. సుమంత్ కుమార్ జిల్లా, రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల ప్రాణాలను కాపాడుతూ, సేవాభావంతో నిరంతరం విధులు నిర్వహిస్తున్న వైద్యుల సేవలు సమాజానికి అమూల్యమైనవని అన్నారు. అనారోగ్య పరిస్థితుల్లో రోగులకు ధైర్యం…
డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వర్కింగ్ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కాంబ్లే సూర్యకాంత్ నియమకం
*డెమోక్రటిక్ జర్నలిస్టు ఫెడరేషన్ వర్కింగ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి గా కాంబ్లే సూర్యకాంత్ నియామకం…*
నిర్మల్ జిల్లా మాజీ అధ్యక్షులు కాంబ్లే సూర్యకాంత్ ని డీజే ఎఫ్ (డబ్ల్యూ) జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు
అరుణ్ కుమార్ మరియు రాష్ట్ర అధ్యక్షులు కోలా శ్రీనివాస్ నాయకత్వంలో
రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం జరిగింది.
ఈ సందర్భంగా నూతన రాష్ట్ర కార్యదర్శి గా నియామక మైన సందర్భంలో సూర్యకాంత్ మాట్లాడుతూ డీజే ఎఫ్ డబ్ల్యూ జర్నలిస్ట్ సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు అరుణ్ కుమార్ గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు కోల శ్రీనివాస్ గారు నాపై విశ్వాసంతో నమ్మకంతో పదవి బాధ్యతలు అప్పగించిన సందర్భంగా నా యొక్క మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నాపై రాష్ట్రంలో డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వర్కింగ్ యొక్క పదవీ బాధ్యతలు సంఘాన్ని బలోపేతం మరియు జర్నలిస్టుల అభివృద్ధి చెందడానికి నా వంతు కృషి చేస్తానని అన్నారు
ఈ సందర్భంలో నిర్మల్ జిల్లా. డి జె ఎఫ్ డబ్ల్యూ వర్కింగ్ యూనియన్ సంఘం నాయకులు అరుగుల పోశెట్టి మారాజు గంగాధర్ పాతర్ల రాజు తాడిచెట్ల మధు అభినందించారు
క్వాలిఫైడ్ డాక్టర్ల సేవలు అమూల్యం.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: డీఎంహెచ్‌వో డా. బి. రాజశ్రీ
క్వాలిఫైడ్ డాక్టర్ల సేవలు అమూల్యం.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: డీఎంహెచ్‌వో డా. బి. రాజశ్రీ
నిజామాబాద్ జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం – 100.31 శాతం లక్ష్యం పూర్తి*
*మూడు రోజుల్లో 1,92,470 మంది చిన్నారులకు పోలియో చుక్కలు* *ఇంటింటికీ వెళ్లి మిగిలిన చిన్నారులకు చుక్కలు వేసిన వైద్య సిబ్బంది* *కార్యక్రమం విజయవంతానికి సహకరించిన అందరికీ డీఎంహెచ్‌వో అభినందనలు* నిజామాబాద్ జిల్లాలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. మూడో రోజు బూత్‌ల వద్ద పోలియో చుక్కలు వేయించని ఐదేళ్లలోపు చిన్నారులను గుర్తించి ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, నర్సింగ్ విద్యార్థినులు, ఎన్‌సీసీ వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు అందించారు….
ముధోల్ లో రూ 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భూసేకరణను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఆదేశం
**ముధోల్ లో రూ 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భూసేకరణను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఆదేశం****ముధోల్ (E6TV వెబ్ న్యూస్):**ముధోల్ మండల కేంద్రంలో దాదాపు రూ. 200 కోట్ల భారీ వ్యయంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్’ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. ఈ మెగా ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని స్థానిక శాసనసభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు.బుధవారం…

