Breaking News

స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదల చేసిన MHSRB

హైదరాబాద్: తెలంగాణ వైద్య ఆరోగ్య సేవల నియామకాల బోర్డు (MHSRB) మంగళవారం మరో 10 విభాగాలకు చెందిన సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్) పోస్టుల ప్రొవిజనల్ మెరిట్ జాబితాలను విడుదల చేసింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ (డీఎస్‌హెచ్) పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీల భర్తీ ప్రక్రియను ముమ్మరం చేస్తూ ఈ ప్రకటన విడుదల చేశారు. ఆప్తాల్మాలజీ, ఈఎన్‌టీ, పాథాలజీ, డెర్మటాలజీ, సైకియాట్రీ, పల్మొనాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయోలాజీ విభాగాలకు సంబంధించిన ప్రొవిజనల్…

Read More

అంతర్‌రాష్ట్ర బైక్‌ దొంగల ముఠా గుట్టురట్టు: 8 మంది అరెస్ట్, 44 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర ప్రాంతాల్లో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్‌రాష్ట్ర ముఠాను ఆదిలాబాద్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. దొంగతనాలకు పాల్పడిన ఐదుగురితో పాటు చోరీ బైకులను కొనుగోలు చేసిన ముగ్గురిని కలిపి మొత్తం 8 మందిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన వరుస ద్విచక్ర వాహనాల దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు సిసిటివి (CCTV) ఫుటేజ్,…

Read More

సీజనల్ వ్యాధులపై అవగాహనకు షార్ట్‌ఫిల్మ్ ఆవిష్కరణ

నిజామాబాద్ ఆగస్టు 12: E6 tv NEWS ( శివ ఠాకూర్).వర్షాకాలంలో సంభవించే సీజనల్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రూపొందించిన “మన ఆరోగ్యం మన చేతుల్లోనే” అనే షార్ట్‌ఫిల్మ్‌ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ ఆవిష్కరించారు.గోవిందపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మానస ఆధ్వర్యంలో, ఉపాధ్యాయుడు కోకిల నాగరాజు రచించి, రూపొందించిన ఈ షార్ట్‌ఫిల్మ్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి. రాజశ్రీ మాట్లాడుతూ.. వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొనే…

Read More

భూ కేటాయింపులపై కేటీఆర్‌వి అబద్ధపు ప్రచారాలు: మంత్రి శ్రీధర్ బాబు ధ్వజమెత్తు

హైదరాబాద్: భూ కేటాయింపులు మరియు ఇతర అంశాలపై బిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మండిపడ్డారు. బుధవారం గాంధీ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఫామ్‌హౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్ పండించిన వడ్లకు ఎంత మద్దతు ధర వచ్చిందో ముందుగా రైతులకు కేటీఆర్ సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. భూ కేటాయింపులపై కేటీఆర్ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టిన శ్రీధర్ బాబు, కాంగ్రెస్ ప్రభుత్వం…

Read More

తెలంగాణను హెచ్‌ఐవీ రహిత రాష్ట్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్: హెచ్‌ఐవీ, ఎయిడ్స్, సిఫిలిస్ వంటి వ్యాధుల నివారణ, ముందస్తు గుర్తింపు మరియు చికిత్సపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు హైదరాబాద్‌లోని హెచ్‌ఎమ్‌డీఏ (HMDA) మైదానం నుంచి నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ వరకు భారీ అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుమారు 1,500 మంది పాల్గొన్నారు. “బీ పాజిటివ్ – స్టాప్ హెచ్‌ఐవీ పాజిటివ్” (Be Positive –…

Read More

లో-వోల్టేజ్‌ సమస్య పరిష్కారం, నష్టాల నివారణకు TGNPDCL కీలక చర్యలు

హైదరాబాద్: తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (TGNPDCL) పరిధిలో వోల్టేజ్ సమస్యలను అధిగమించేందుకు, సాంకేతిక విద్యుత్ నష్టాలను (Technical Losses) తగ్గించేందుకు కెపాసిటర్ బ్యాంకులు, వోల్టేజ్ బూస్టర్ల ఏర్పాటు ద్వారా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (CMD) కర్నాటి వరుణ్ రెడ్డి వెల్లడించారు. TGNPDCL పరిధిలో దాదాపు 14 లక్షల వ్యవసాయ విద్యుత్ పంపుసెట్లు ఉన్నాయని, ఇండక్టివ్ లోడ్ (Inductive Load) ఎక్కువగా ఉండటం వల్ల పవర్ ఫ్యాక్టర్ తగ్గి,…

Read More

ఎయిడ్స్‌పై రెండు నెలల పాటు విస్తృత అవగాహన కార్యక్రమం

నిజామాబాద్ ఆగస్టు 12: (E6 tv NEWS, శివ ఠాకూర్). హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఎయిడ్స్‌ విభాగం ఆధ్వర్యంలో రెండు నెలల పాటు నిర్వహించనున్న విస్తృత అవగాహన కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) శ్రీ భుజంగరావు బుధవారం ప్రారంభించారు.నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని అదనపు కలెక్టర్‌ ఛాంబర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ బి. రాజశ్రీతో కలిసి ఐఐఈసీ (Intensified Information, Education & Communication) కార్యక్రమాన్ని…

Read More

జార్ఖండ్ విద్యార్థుల ఆందోళనలు న్యాయమైనవి, సీబీఐ విచారణ జరిపించాలి: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు

హైదరాబాద్: జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC) ప్రశ్నాపత్రాల లీకేజీ అంశంపై రాంచీలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు పూర్తిగా న్యాయమైనవని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు బుధవారం అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ లీకేజీ వ్యవహారాన్ని వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)కి అప్పగించాలని జార్ఖండ్ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జార్ఖండ్ విద్యార్థుల ఉద్యమం వెనుక ఏ రాజకీయ పార్టీ ప్రమేయం లేదని,…

Read More

ఇథనాల్ అంశంపై కాంగ్రెస్, కేజ్రీవాల్‌లకు కిషన్ రెడ్డి ఘాటు కౌంటర్

హైదరాబాద్: ఇథనాల్ బ్లెండింగ్ (పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం) ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న విమర్శలపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి మంగళవారం తీవ్రంగా మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ (UPA) ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ల కాలక్రమాన్ని (Chronology) బయటపెడుతూ వారిపై నిప్పులు చెరిగారు. ఇథనాల్ బ్లెండింగ్‌పై రాహుల్ గాంధీ దేశ ప్రజలకు “అబద్ధాలు” చెప్తున్నారని, విదేశీ దిగుమతులపై…

Read More

మధిర మున్సిపల్ ఆఫీస్‌ను ముట్టడించిన బిఆర్‌ఎస్ నాయకులు

ఖమ్మం / మధిర: పట్టణంలోని పలు కాలనీల్లో నెలకొన్న పారిశుధ్య లోపం, ప్రాథమిక వసతుల కొరతను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారత్ రాష్ట్ర సమితి (BRS) నాయకులు, కార్యకర్తలు మంగళవారం ఖమ్మం జిల్లాలోని మధిర మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్లకార్డులు చేతబూని మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళనకారులను ఉద్దేశించి బిఆర్‌ఎస్ మధిర నియోజకవర్గ ఇన్ఛార్జ్ లింగాల కమల్ రాజ్ మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలోని వివిధ కాలనీలలో చెత్తాచెదారం పేరుకుపోయి, పారిశుధ్యం…

Read More