Telangana
నగరంలో 288 మంది మొబైల్ దొంగలకు కౌన్సెలింగ్: మళ్లీ నేరాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు తప్పవు – సిటీ పోలీస్ హెచ్చరిక!
హైదరాబాద్: నగరంలో మొబైల్ ఫోన్ల దొంగతనాలకు స్వస్తి చెప్పాలనే లక్ష్యంతో హైదరాబాద్ నగర పోలీసులు గురువారం ఒకేసారి ఏడు జోన్ల పరిధిలోని 288 మంది మొబైల్ దొంగతనాల నిందితులకు బృహత్ కౌన్సెలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అడిషనల్ కమిషనర్ (క్రైమ్స్ & ఎస్‌ఐటీ) ఎం. శ్రీనివాస్ నేతృత్వంలో జరిగిన ఈ కౌన్సెలింగ్ సమావేశంలో నేరస్థులలో మార్పు తీసుకురావడంతో పాటు, పదే పదే నేరాలకు పాల్పడేవారిపై కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. కౌన్సెలింగ్ సమావేశంలో…
మహబూబాబాద్‌లో విషాదం: చేనులో పత్తి ఏరేందుకు వెళ్లిన 22 ఏళ్ల యువతి బావిలో శవమై లభ్యం!
మహబూబాబాద్ / కేసముద్రం: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గాంధీనగర్ గ్రామానికి చెందిన 22 సంవత్సరాల యువతి బాణోత్ వెన్నెల అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఏం జరిగింది? స్థానికులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం ఉదయం వెన్నెల పత్తి చేనులో పని చేయడానికి పొలానికి వెళ్లింది. అనంతరం ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో ఆరా తీయగా, గాంధీనగర్ సమీపంలో ఉన్న ఒక వ్యవసాయ బావిలో ఆమె మృతదేహం తేలియాడుతూ…
హైదరాబాద్ నుంచి ఒకే రోజులో ఆధ్యాత్మిక, ప్రకృతి పర్యటన: తెలంగాణ టూరిజం కొత్త ప్యాకేజీ ప్రారంభం!
హైదరాబాద్: హైదరాబాద్ నివాసితులకు, పర్యాటకులకు శుభవార్త! భక్తి, ప్రకృతి సౌందర్యం మరియు కుటుంబ వినోదాల సమ్మేళనంతో తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (TGTDC) ఒక నూతన “వన్ డే పిల్‌గ్రిమేజ్ అండ్ ఎకో-టూర్ ప్యాకేజీ”ని ప్రకటించింది. ఈ ప్యాకేజీ సేవలు 2026 ఆగస్టు 7, శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఒక రోజు పర్యటనలో భాగంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చిల్కూరు బాలాజీ దేవాలయంతో పాటు సరికొత్తగా అభివృద్ధి చేసిన ఎకో పార్కులను సందర్శించేలా రూట్ మ్యాప్…
ఆదిలాబాద్–నిర్మల్–ఆర్మూర్ రైల్వే లైన్‌కు కేంద్రం సానుకూల స్పందన
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన తెలంగాణ బీజేపీ ప్రజాప్రతినిధులు – ప్రాజెక్ట్ అమలుకు చర్యలు తీసుకుంటామని హామీ న్యూఢిల్లీ/నిర్మల్, జూలై 31 (E6TV): Md, అమీనుద్దీన్.ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ఎంతో కీలకంగా భావిస్తున్న ఆదిలాబాద్–నిర్మల్–ఆర్మూర్ రైల్వే లైన్ ప్రాజెక్ట్ అమలుపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ ప్రాజెక్ట్‌ను త్వరితగతిన అమలు చేయాలని కోరుతూ తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు….
డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే రోడ్డు భద్రతా కోర్సు విధిగా పూర్తి చేయాలి: తెలంగాణ రవాణా శాఖ కొత్త నిబంధన!
హైదరాబాద్: తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్ (Driving Licence) పొందాలనుకునే వారికి రవాణా శాఖ కీలక సంస్కరణను ప్రకటించింది. ఇకపై డ్రైవింగ్ టెస్ట్‌కు హాజరు కావడానికి ముందే దరఖాస్తుదారులు రోడ్డు భద్రతా కోర్సును (Road Safety Course) విధిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. లెర్నర్ లైసెన్స్ (LLR) పొందిన తర్వాత ఈ కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన వారికి మాత్రమే డ్రైవింగ్ టెస్ట్ స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశం లభిస్తుంది. రోడ్డు ప్రమాదాల్లో మానవ తప్పిదాలను తగ్గించడం, కొత్త…
హైదరాబాద్‌లో ఆస్తి వివాదం: వదినపై హత్యాయత్నానికి దిగిన మరిది, ఇద్దరు అనుచరులతో సహా అరెస్ట్!
హైదరాబాద్: కుటుంబ ఆస్తి తగదాల కారణంతో వదినపై అత్యంత ఘాతుకానికి ఒడిగట్టి, ఆమెను హత్య చేయడానికి యత్నించిన ప్రధాన నిందితుడితో పాటు అతనికి సహకరించిన ఇద్దరు అనుచరులను టాప్‌చబుత్రా పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే: ఆసిఫ్‌నగర్‌కు చెందిన ముహమ్మద్ దస్తగిరి షరీఫ్ అలియాస్ పప్పు తన వదిన షమీమ్ బేగమ్‌తో కొంతకాలంగా ఆస్తి తగాదాలు, కుటుంబ విభేదాలతో కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఆమెను అంతమొందించేందుకు తన అనుచరులైన ముహమ్మద్ గులామ్ నబీ ఖురేషీ, ముహమ్మద్…
రేషన్ కార్డుదారులకు శుభవార్త.. ఈ-కేవైసీ గడువు ఆగస్టు 31 వరకు పొడిగింపు!
హైదరాబాద్: తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఉపశమనం కల్పించింది. రేషన్ కార్డుల ఈ-కేవైసీ (e-KYC) నమోదు ప్రక్రియ ఆఖరి గడువును ఆగస్టు 31, 2026 వరకు పొడిగిస్తూ పౌరసరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతుండటంతో పాటు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియ జరుగుతుండటంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ గడువును పెంచినట్లు అధికారులు వెల్లడించారు. దీనితో పాటు…
ఉప్పొంగుతున్న గోదావరి: భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ!
భద్రాచలం: ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. శుక్రవారం ఉదయం 10:45 గంటల సమయానికి భద్రాచలం వద్ద నీటిమట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను (First Danger Warning) జారీ చేశారు. ఎగువన వర్షాల ఉధృతి కొనసాగుతుండటంతో నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని ముంపు ప్రాంత ప్రజలను హెచ్చరించారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి వంతెన వద్ద ప్రవాహం ఏకంగా 9,32,288…
ఉత్తర తెలంగాణకు వరం ‘ఆదిలాబాద్–నిర్మల్–ఆర్మూర్’ కొత్త రైల్వే లైన్.. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌కు మహేశ్వర్ రెడ్డి ధన్యవాదాలు!
హైదరాబాద్ / న్యూఢిల్లీ: ఉత్తర తెలంగాణ ప్రాంత ప్రజల సుదీర్ఘ నిరీక్షణకు త్వరలోనే తెరపడనుంది. కొత్తగా ప్రతిపాదించిన ఆదిలాబాద్ – నిర్మల్ – ఆర్మూర్ రైల్వే లైన్ ఉత్తర తెలంగాణ ప్రాంత రవాణా వ్యవస్థలో కీలక మార్పులు తీసుకువస్తుందని శాసనసభలో బిజెపి ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రతినిధి బృందంతో కలిసి మహేశ్వర్ రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు….
ఫార్ములా-ఈ రేసు కేసు: నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరైన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్!
హైదరాబాద్: హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా-ఈ (Formula E) రేసు వ్యవహారంలో నమోదైన కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ. రామారావు (కేటీఆర్) శుక్రవారం నాంపల్లిలోని ప్రత్యేక ఏసీబీ (ACB) కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో అధికారిక విచారణ ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఛార్జ్‌షీట్‌లో పేరున్న నిందితులందరూ విచారణ మొదటి రోజు నేరుగా కోర్టుకు హాజరుకావాలని నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఈ ఉత్తర్వుల మేరకు కేటీఆర్‌తో పాటు మాజీ మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి…

