Telangana
సంగారెడ్డి జిల్లాలో దారుణం: అర్ధనగ్నంగా, తీవ్ర గాయాలతో వ్యక్తి మృతదేహం లభ్యం!
సంగారెడ్డి / పుల్కల్: సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని ఎస్. ఇటిక్యాల్ గ్రామంలో ఒక వివాహిత యువకుడు అనుమానాస్పద స్థితిలో దారుణ హత్యకు గురయ్యాడు. శనివారం ఉదయం గ్రామ సమీపంలో అతడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. బాధితుడిని రాజు (28)గా పోలీసులు గుర్తించారు. ఏం జరిగింది? స్థానికులు మరియు పోలీసుల కథనం ప్రకారం, రాజు శుక్రవారం రాత్రి ఇల్లు వదిలి బయటకు వెళ్లాడు. శనివారం ఉదయం గ్రామ పొలాల్లో అతడు అర్ధనగ్న స్థితిలో, శరీరంపై తీవ్ర గాయాలతో…
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్
సదాశివనగర్, ఆగస్టు 1: E6 tv NEWS. ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అశోక్ గార్డెన్లో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ పాల్గొని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ, ప్రజాసేవలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మరిన్ని…
లచ్మాపూర్ శివారులో పత్తి పంటను పరిశీలించిన ఏఈఓ విశాల్ గౌడ్
రసం పీల్చే పురుగుల నివారణకు రైతులకు సూచనలు లచ్మాపూర్, ఆగస్టు 1: (E6 tv NEWS M, మస్నాజీ) లచ్మాపూర్ శివారులోని పత్తి పంటను వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) విశాల్ గౌడ్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పత్తి పంటలో రసం పీల్చే పురుగులైన పంచ దోమ, తెల్ల దోమ, పెను బంకలను గుర్తించి, వాటి నివారణకు రైతులు సకాలంలో తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. పురుగుల నివారణ కోసం ఒక లీటర్ నీటికి…
సీఎం సహాయనిధితో నిరుపేదకు అండగా
రూ.5 లక్షల ఎల్‌ఓసీ లేఖను అందజేసిన ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి నిజామాబాద్, ఆగస్టు 1: (E6 tv NEWS శివ ఠాకూర్). అత్యవసర వైద్య చికిత్స అవసరమైన నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి కొండంత అండగా నిలుస్తోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి తెలిపారు. ధర్పల్లి మండలం రామడుగు గ్రామానికి చెందిన నాయిక మహేష్ అనారోగ్య సమస్యలతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శస్త్రచికిత్స కోసం రూ.5 లక్షలు అవసరమని…
ఊర పండగ నేపథ్యంలో నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆగస్టు 2న ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దారి మళ్లింపు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని పోలీసుల సూచన నిజామాబాద్, ఆగస్టు 1: (E6 tv NEWS శివ ఠాకూర్). ఊర పండగ సందర్భంగా ఆగస్టు 2న నిర్వహించే ఊరేగింపును పురస్కరించుకుని నిజామాబాద్ నగరంలో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు పోలీస్ కమిషనర్ కార్యాలయం వెల్లడించింది. ప్రజలు ట్రాఫిక్ మళ్లింపులను గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించింది. పోలీసుల వివరాల ప్రకారం,…
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందిస్తాం: ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి.
జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రెస్ క్లబ్ ప్రతినిధులు కలెక్టర్ బాధ్యతలు చేపట్టిన వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ నిజామాబాద్, ఆగస్టు 1: (E6 tv NEWS: శివ ఠాకూర్). ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు శనివారం ఉదయం ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి, జర్నలిస్టుల మిత్రుల అందరి తరఫు నుండి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య…
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా
వర్షాలతో ఇల్లు కూలిన బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అధికారులకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం ఇందూరు, ఆగస్టు 1: E6 tv NEWS, శివ ఠాకూర్. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా సూచించారు. శనివారం నగరంలోని 42వ డివిజన్ చంద్రశేఖర్ కాలనీలో భారీ వర్షాలకు షేక్ ఫిరోజ్ నివాసం కూలిపోవడంతో బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు.ఈ సందర్భంగా…
విదేశీ ఉద్యోగార్థులకు ‘టామ్‌కామ్’ ద్వారా సమగ్ర సేవలు: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం!
హైదరాబాద్: తెలంగాణ నుంచి విదేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లే యువతకు శిక్షణ ఇవ్వడం, జాబ్ మేళాలు నిర్వహించడం, పాస్‌పోర్ట్ సేవలు అందించడం మరియు విదేశాల్లో మంచి ఉద్యోగాలు కల్పించే మొత్తం ప్రక్రియ బాధ్యతను తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (TOMCOM – టామ్‌కామ్)కే అప్పగిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం ‘శక్తి’ (SHAKTI – Skill Human Capital and Knowledge Training Initiatives) శాఖపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు….
సోషల్ మీడియాలో మహిళలకు వల.. వేధింపులకు పాల్పడుతున్న ఎస్సై శ్రీకాంత్ అరెస్ట్!
హైదరాబాద్ / వరంగల్: సోషల్ మీడియా ద్వారా మహిళలతో పరిచయాలు పెంచుకుని, వారిని లొంగదీసుకుని తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్న ఒక సబ్‌ఇన్‌స్పెక్టర్ (SI) కే. శ్రీకాంత్‌ను వరంగల్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. సుబేదారి పోలీస్ స్టేషన్ ఇన్స్‌స్పెక్టర్ ఎం. రంజిత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన శ్రీకాంత్ 2014 బ్యాచ్‌కు చెందిన వివాహిత ఎస్సై. అతను సోషల్ మీడియాలో మహిళల ప్రొఫైళ్లను వెతికి, ఫ్రెండు రిక్వెస్టులు పంపి, వారితో సాన్నిహిత్యం…
ఇంజనీరింగ్ విద్యార్థులను అవమానించిన సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి: బీజేవైఎం
నిజామాబాద్‌లో సీఎం దిష్టిబొమ్మ దహనం.. క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిక ఇందూరు, ఆగస్టు 1: E6 tv NEWS శివ ఠాకూర్. ఇంజనీరింగ్ విద్యార్థులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తాలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీఎం వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని రాష్ట్రంలోని ఇంజనీరింగ్ విద్యార్థులకు బహిరంగంగా…

