జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కాట్‌పల్లి నగేష్‌రెడ్డి
37వ డివిజన్‌లో మట్టి వినాయకుల పంపిణీ
నిజామాబాద్, సెప్టెంబర్ 13:(E6tv NEWS: ప్రతినిధి).
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి పర్యావరణాన్ని కాపాడేందుకు తమ వంతు కృషి చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాట్‌పల్లి నగేష్‌రెడ్డి అన్నారు.నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని 37వ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి టెంట్ హౌస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమంలో నగేష్‌రెడ్డి పాల్గొన్నారు. ఆయనతో పాటు నగర మేయర్ ఉమారాణి, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నగేష్‌రెడ్డి మాట్లాడుతూ.. పర్యావరణానికి హాని కలిగించే రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలకు బదులుగా మట్టి వినాయకులను పూజించాలని ప్రజలకు సూచించారు. మట్టి విగ్రహాల వినియోగం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు నీటి కాలుష్యాన్ని నివారించవచ్చని తెలిపారు.వినాయక చవితి పర్వదినాన్ని ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుతూ జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు ఎర్రం గంగాధర్, ప్రవీణ్, కోఆప్షన్ సభ్యుడు బొబ్బిలి మురళి, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



