Breaking News

బాసర మండల ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం ఎన్నిక

బాసర, సెప్టెంబర్ 13:(E6tv NEWS: ప్రతినిధి).

బాసర మండల ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం 2026–27 సంవత్సరానికి ఏకగ్రీవంగా ఎన్నికైంది. మండలంలోని మీడియా ప్రతినిధులు సమావేశమై నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

నూతన కార్యవర్గంలో గౌరవ అధ్యక్షుడిగా సంగవార్ హన్మంత్ రావు, అధ్యక్షుడిగా బత్తిరి ప్రసాద్, ఉపాధ్యక్షుడిగా నర్సూరి భీమ్ రావు, ప్రధాన కార్యదర్శిగా గణేష్ జాదవ్, కార్యదర్శిగా మమ్మాయి మహేందర్, పీఆర్వోగా పింపలే రామేశ్వర్, కోశాధికారిగా ఆనంద్ బండారి ఎన్నికయ్యారు.

కార్యవర్గ సభ్యులుగా పల్లె హరిదాస్, కొదటి సుధాకర్, రత్నల్లి రమేష్, అవదూత్, మొజెస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు బత్తిరి ప్రసాద్ మాట్లాడుతూ.. మండలంలోని మీడియా ప్రతినిధుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం అందరినీ కలుపుకొని పనిచేస్తానన్నారు.అనంతరం నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు బత్తిరి ప్రసాద్‌ను తోటి మీడియా ప్రతినిధులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యవర్గ సభ్యులకు కూడా అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *