Telangana
అంగన్‌వాడీ టీచర్ ప్రేమలతకు ఉత్తమ అంగన్‌వాడీ టీచర్‌గా ప్రశంసా పత్రం
ఎర్గట్ల, ఆగస్టు 23: (E6tv NEWS: T.గంగాధర్). 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రంలో ఆదివారం జీఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎర్గట్ల మండలం తోర్తి గ్రామానికి చెందిన అంగన్‌వాడీ టీచర్ ప్రేమలతకు ఉత్తమ అంగన్‌వాడీ టీచర్‌గా ప్రశంసా పత్రం అందజేశారు.అంగన్‌వాడీ కేంద్రంలో విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందిస్తూ, చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మెరుగైన సేవలు అందించినందుకు గుర్తింపుగా ప్రేమలతకు ఈ ప్రశంసా పత్రాన్ని అందించినట్లు నిర్వాహకులు తెలిపారు….
మేనూర్‌లో ఘనంగా అన్నాభౌ సాఠే 106వ జయంతి వేడుకలు
మద్నూర్, ఆగస్టు 23: (E6tv NEWS: ప్రతినిధి). కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూర్ గ్రామంలో ఆదివారం సాహిత్య రత్న, లోక్‌షాహిర్ డాక్టర్ అన్నాభౌ సాఠే 106వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నాభౌ సాఠే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. డాక్టర్ అన్నాభౌ సాఠే సామాజిక సమానత్వం, దళితుల హక్కులు, కార్మికుల సంక్షేమం కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడని కొనియాడారు. ఆయన రచనలు, పాటలు, ప్రజా…
ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై మాజీ మేయర్ సంజయ్ తీవ్ర ఆగ్రహం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత వ్యాఖ్యలు సరికాదు రాజకీయ విమర్శలు విధానాలపై ఉండాలి.. వ్యక్తిగత దూషణలకు తావులేదు ఎంపీ అరవింద్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ నిజామాబాద్, ఆగస్టు 23: (E6 tv NEWS: శివ ఠాకూర్). తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిజామాబాద్ నగర మాజీ మేయర్ సంజయ్ తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి వ్యక్తిగత రూపురేఖలపై వ్యాఖ్యలు చేయడం రాజకీయ సంస్కారానికి విరుద్ధమని ఆయన…
మద్నూర్ మండల సమాఖ్య నూతన పాలకవర్గం ఎన్నిక
మద్నూర్, ఆగస్టు 22: (E6tv NEWS: ప్రతినిధి). మద్నూర్ మండల సమాఖ్య సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను ఆడిట్ చేయించి, ఆడిట్ నివేదికను సర్వసభ్య సమావేశంలో ఆమోదించారు. గత ఆర్థిక సంవత్సరంలో మండల సమాఖ్యకు రూ.5,86,413 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మద్నూర్ మండల ఎంపీడీవో పి. సాయిలు పాల్గొని మండల సమాఖ్య సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. మండలంలోని మహిళలందరూ స్వయం సహాయక సంఘాల్లో చేరాలని,…
పెద్ద ఎక్లారలో 200 ఈత మొక్కలు నాటిన ఎక్సైజ్ సిబ్బంది
మద్నూర్, ఆగస్టు 22: (E6tv NEWS: ప్రతినిధి). వన మహోత్సవంలో భాగంగా మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లార గ్రామంలో శనివారం ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 200 ఈత మొక్కలు నాటారు. బిచ్కుంద ఆబ్కారీ శాఖ, గౌడ సంఘం, గ్రామస్థుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.జిల్లా ఆబ్కారీ అధికారి ఈఎస్ ముకుందరెడ్డి ఆదేశాల మేరకు మొక్కలు నాటినట్లు ఎక్సైజ్ ఎస్ఐ నాగేష్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఈత చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించడమే కార్యక్రమం లక్ష్యమన్నారు.ఈ కార్యక్రమంలో ఎక్సైజ్…
హబ్సిగూడ, ఉప్పల్ జంక్షన్లలో ట్రాఫిక్ కష్టాలకు చెక్: ఫ్రీ-లెఫ్ట్ విస్తరణ పనులు ప్రారంభం
హైదరాబాద్: నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించి, వాహనాల రాకపోకలను సులభతరం చేసేందుకు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC) అధికారులు చర్యలు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా హబ్సిగూడ LFJC జంక్షన్ మరియు ఉప్పల్ ప్రధాన జంక్షన్లలో ప్రతిపాదిత ‘ఫ్రీ-లెఫ్ట్’ (Free-Left) మెరుగుదల పనులను మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి శనివారం నేరుగా పరిశీలించారు. ప్రధాన నిర్ణయాలు & చర్యలు: రహదారి భద్రతను పెంచడంతో పాటు నిరంతర వాహన రాకపోకలకు వీలుగా త్వరితగతిన…
సైబరాబాద్‌లో 17 ఆలయాల్లో ‘డివైన్ కలెక్షన్ డ్రైవ్’ ప్రారంభించిన సిఎంసి
హైదరాబాద్: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) పరిధిలో పూజలకు ఉపయోగించిన వస్తువులు, పటాలు, విగ్రహాలను బహిరంగ ప్రదేశాల్లో లేదా జలశయాన్లలో పడేయకుండా సురక్షితంగా సేకరించేందుకు ‘డివైన్ కలెక్షన్ డ్రైవ్’ (Divine Collection Drive) కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. సైబరాబాద్ వ్యాప్తంగా ఎంపిక చేసిన 17 ప్రధాన దేవాలయాల్లో ప్రత్యేక సేకరణ కేంద్రాలను (Collection Points) ఏర్పాటు చేశారు. ప్రధాన వివరాలు & నిర్వహణ: నగరంలో పారిశుద్ధ్యాన్ని కాపాడటానికి మరియు నీటి వనరులను కలుషితం కాకుండా చూడటానికి సహకరిస్తున్న…
ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం.. నవజాత శిశువు మృతి
కామారెడ్డి, ఆగస్టు 22: (E6tv NEWS ప్రతినిధి). కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే నవజాత శిశువు మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. సకాలంలో ప్రసవం చేయకపోవడంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని ఆరోపిస్తూ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం సుమారు 9 గంటలకు స్వరూప అనే బాలింతను ప్రసవం కోసం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆమెకు తీవ్ర ప్రసవ నొప్పులు ఉన్నప్పటికీ వైద్యులు వెంటనే…
సనత్‌నగర్ టిమ్స్‌లో ఓపీ నమోదు ప్రారంభం; ఐపీ సేవలకు మరికొంత సమయం
హైదరాబాద్: సనత్‌నగర్‌లోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS) ఆసుపత్రిలో అవుట్‌పేషెంట్ (OP) రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రతిరోజూ ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు ఓపీ టోకెన్లు జారీ చేస్తుండగా, వైద్యులు మధ్యాహ్నం 2:00 గంటల వరకు రోగులను పరీక్షించి వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రధాన ముఖ్యాంశాలు: ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా ఎక్కువ మంది తరలివచ్చినందున ఈ ముందస్తు పారిశుధ్య చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఓపీ టోకెన్ల…
కడెం ప్రాజెక్ట్ బ్యాక్‌వాటర్స్‌లో ద్వీప పర్యాటకానికి ప్రణాళికలు
నిర్మల్: తెలంగాణలో ‘ఐలాండ్ టూరిజం’ (ద్వీప పర్యాటకం) ప్రాచుర్యం పొందుతున్న నేపథ్యంలో, నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ బ్యాక్‌వాటర్స్‌లో ఉన్న ఒక ద్వీపాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (TGTDC) ప్రత్యేక దృష్టి సారించింది. సహ్యాద్రి కొండల మధ్య, ప్రసిద్ధ కుంతల జలపాతానికి దిగువన ఉన్న ఈ ద్వీపం పర్యాటకులను ఆకట్టుకునేలా రూపుదిద్దుకోనుంది. ప్రధాన ఆకర్షణలు & ప్రతిపాదనలు: గతంలో 2016లో ఇక్కడ బోటింగ్ ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు జరిగినప్పటికీ, మత్స్యకారుల చేపల…

