పుట్టపర్తి, సెప్టెంబర్ 13:(E6tv NEWS: ప్రతినిధి)
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సత్యసాయి జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
వినాయక చవితి వేడుకలను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ సూచించారు. వేడుకల సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు పోలీసుల సూచనలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.
శ్రీ వినాయకుని ఆశీస్సులతో జిల్లా ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతి, సమృద్ధి కలగాలని ఎస్పీ ఆకాంక్షించారు.

