మద్నూర్, సెప్టెంబర్ 13: (E6tv NEWS: ప్రతినిధి)
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రం వద్ద ఆదివారం కొత్త ఓటర్ల నమోదు కోసం దరఖాస్తుల స్వీకరణ శిబిరం నిర్వహించారు.
18 సంవత్సరాలు నిండిన యువతీ యువకుల నుంచి కొత్త ఓటరు నమోదు దరఖాస్తులతో పాటు ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులకు సంబంధించిన దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా నాలుగు విడతలుగా దరఖాస్తుల స్వీకరణ చేపట్టినట్లు బీఎల్వోలు తెలిపారు.
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీఎల్వోలు సత్యం, దినకర్, స్వామి, రంజిత్, బాబు, కృష్ణ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

