Breaking News

నిబంధనలు పాటిద్దాం.. ప్రమాదాలను నివారిద్దాం

డ్రైవర్లు, సిబ్బందికి రోడ్ సేఫ్టీపై అవగాహన నిజామాబాద్, సెప్టెంబర్ 23:(E6 tv NEWS: ప్రతినిధి). రహదారి భద్రతా నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలను నివారించాలని టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ అధికారులు సూచించారు. నిజామాబాద్ రీజియన్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో డ్రైవర్లు, సిబ్బందికి రోడ్‌ సేఫ్టీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి A.M.V.I. మణికాంత్ ముఖ్య అతిథిగా హాజరై రహదారి భద్రతపై పలు సూచనలు చేశారు. కలెక్టర్ కార్యాలయం నుంచి రోడ్‌ సేఫ్టీ ఈదార్ మేనేజర్ వర్షా నిహంత్…

Read More

బీఎస్పీ జిల్లా కార్యదర్శిగా మాల్యవంతం రాంప్రసాద్

ధర్మవరం, సెప్టెంబర్ 22:(E6tv NEWS: ప్రతినిధి) బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) శ్రీ సత్యసాయి జిల్లా కార్యదర్శిగా ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలానికి చెందిన బహుజన నాయకుడు మాల్యవంతం రాంప్రసాద్ నియమితులయ్యారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ మార్గదర్శకత్వంలో జిల్లా అధ్యక్షులు సాకే వినయ్ కుమార్ ఈ నియామకాన్ని ప్రకటించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా రాంప్రసాద్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్, రాష్ట్ర…

Read More

కుల సంఘాలే అర్హులను నిర్ణయించాలి

రుద్రూరులో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పంపిణీకి రంగం సిద్ధం రుద్రూరు, సెప్టెంబర్ 22:(E6tv NEWS: ప్రతినిధి). రుద్రూరు మండల కేంద్రంలో గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పంపిణీకి ఎట్టకేలకు కదలిక వచ్చింది. సోమవారం నిర్వహించిన గ్రామసభలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై చర్చ జరిగింది. కుల సంఘాల ప్రతినిధులు తమ సంఘాల్లోని అర్హులైన నిరుపేదల జాబితాను అధికారులకు అందజేయాలని నిర్ణయించినట్లు సమాచారం. కుల సంఘాల నుంచి అర్హుల జాబితా గ్రామంలో ఉన్న కుల సంఘాలు…

Read More

మండల సమాఖ్యలపై మోడల్ శిక్షణ

రానున్న ఐదేళ్లలో సంఘాల అభివృద్ధికి విజన్ రూపొందించుకోవాలి విజన్ సాధనకు పక్కా వ్యూహాలు రూపొందించుకోవాలని సూచన మద్నూర్, సెప్టెంబర్ 22:(E6tv NEWS: ప్రతినిధి). మద్నూర్ మండల సమాఖ్య కార్యాలయంలో గ్రామ సంఘాల అధ్యక్షురాళ్లు, వీఓఏలకు మోడల్ మండల సమాఖ్యలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. NRLM స్టేట్ రిసోర్స్ పర్సన్స్ ఎస్. రమాదేవి, ఓ. కవిత శిక్షణను అందించారు. ఐదేళ్ల అభివృద్ధికి విజన్ రానున్న ఐదేళ్లలో స్వయం సహాయక సంఘాలు, గ్రామ సంఘాలు, మండల సమాఖ్యలు ఏ స్థాయిలో…

Read More

కార్మికుల హక్కులను హరించే లేబర్ కోడ్‌లను వ్యతిరేకించాలి

శ్రీ సత్యసాయి వాటర్ వర్కర్స్‌కు విద్యా, వైజ్ఞానిక శిక్షణా తరగతులు పుట్టపర్తి, సెప్టెంబర్ 22:(E6tv NEWS: ప్రతినిధి). శ్రీ సత్యసాయి వాటర్ వర్కర్స్ ఆధ్వర్యంలో కార్మికులకు విద్యా, వైజ్ఞానిక శిక్షణా తరగతులను పుట్టపర్తి కార్మిక కర్షక భవన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మధుసూదన్ అధ్యక్షత వహించారు. జెండా ఆవిష్కరించిన సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు శిక్షణా తరగతుల ప్రారంభానికి ముందు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ ఓబులు జెండాను ఆవిష్కరించి ప్రారంభ ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన…

Read More

మహిళల ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు

మహా అన్నదాన కార్యక్రమం నిర్వహణ జమ్మికుంట, సెప్టెంబర్ 21: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట పట్టణం 6వ వార్డు హౌసింగ్ బోర్డ్ కాలనీ, 7వ వార్డు దుర్గా కాలనీలో శ్రీ శక్తి మహిళా గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు, మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలంతా కలిసి తొలిసారిగా శ్రీ శక్తి గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో…

Read More

మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

జీవో 52 రద్దు చేసి కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి: మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల నిజామాబాద్, సెప్టెంబర్ 22:(E6tv NEWS: ప్రతినిధి). నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల డిమాండ్ చేశారు. గత ఐదు రోజులుగా ధర్నా చౌక్‌లో మున్సిపల్ కార్మికులు చేపడుతున్న సమ్మెకు ఆయన హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా గణేష్ బిగాల…

Read More

నీటి సమస్యపై తీవ్ర నిరసన: జూరాల యాత్రలో బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు అరెస్ట్‌

మహబూబ్‌నగర్ (ఈ6 టీవీ): జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టిన రైతులకు సంఘీభావం తెలిపేందుకు బయలుదేరిన తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావును పోలీసులు మంగళవారం జడ్చర్ల వద్ద ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్‌తో జడ్చర్లలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాంచందర్ రావుతో పాటు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తదితర కీలక నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్…

Read More

రుద్రూర్‌లో రసాభాసగా మారిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల గ్రామసభ

లబ్ధిదారుల ఎంపిక వాయిదా.. నిరాశకు గురైన నిరుపేదలు రుద్రూర్, సెప్టెంబర్ 22 (E6TV NEWS: ప్రతినిధి).నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహించిన గ్రామసభ రసాభాసగా మారింది. అర్హులైన నిరుపేదలకు ఇళ్ల కేటాయింపు జరుగుతుందని ఆశతో భారీ సంఖ్యలో గ్రామస్తులు హాజరయ్యారు. అయితే లబ్ధిదారుల ఎంపికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో అధికారులు ఎంపిక ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. రుద్రూర్‌లో నిర్మించిన 150 డబుల్ బెడ్‌రూమ్…

Read More

పెండ్‌పెల్లిలో రూ.2.36 కోట్లతో అభివృద్ధి పనులు

భైంసా, సెప్టెంబర్ 21: (E6tv NEWS: ప్రతినిధి). భైంసా మండలం పెండ్‌పెల్లి గ్రామంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సోమవారం ప్రారంభించారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతూ, పూలు చల్లగా, డప్పు చప్పుళ్లతో నిర్వహించిన స్వాగత కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ సందర్భంగా రూ.30 లక్షలతో నిర్మించిన పాఠశాల ప్రహరీ గోడ, రూ.20 లక్షలతో నిర్మించిన మహిళా సమైక్య భవనం,…

Read More