Breaking News

మేడ్చల్ వద్ద కేటీఆర్, హరీశ్ రావు అరెస్ట్!

మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసేందుకు ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు బయలుదేరిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. దీనిని నిరసిస్తూ నేతలు రోడ్డుపైనే బైఠాయించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనంతరం వారిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని బోయిన్‌పల్లి, జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. రంగంలో ఏం జరిగింది?:

Read More

అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు

ఆశా వర్కర్ల అరెస్టులను ఖండించిన సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్‌బాబు ఏర్గట్ల, సెప్టెంబర్‌ 8:(E6tv NEWS: ప్రతినిధి). ఆశా వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేపట్టిన చలో హైదరాబాద్‌ కార్యక్రమానికి వెళ్లకుండా ఆశా కార్యకర్తలను అర్ధరాత్రి నుంచి వివిధ పోలీస్‌ స్టేషన్లలో నిర్బంధించడం సరికాదని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ. రమేష్‌బాబు అన్నారు. మహిళా కార్యకర్తలను సైతం అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్లలో నిర్బంధించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.మంగళవారం డిచ్‌పల్లి, ఇందల్వాయి పోలీస్‌ స్టేషన్లలో…

Read More

స్పీకర్‌పై వ్యాఖ్యలకు నిరసన.. కేసీఆర్‌, ఎమ్మెల్సీ మధు దిష్టిబొమ్మల దహనం

ఎమ్మెల్సీ మధును పదవి నుంచి తొలగించి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ ఏర్గట్ల, సెప్టెంబర్‌ 8:(E6tv NEWS: ప్రతినిధి). తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై ఎమ్మెల్సీ మధు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఏర్గట్ల మండల కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో దళిత సంఘాలు, కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఏర్గట్ల మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో…

Read More

స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై BRS నేతల అనుచిత వ్యాఖ్యలు: నిజాంపేటలో దళిత సంఘాలు నిరసన!

తెలంగాణ శాసనసభ స్పీకర్, దళిత నేత గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తూ కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఇంచార్జ్ కొలను హనుమంత్ రెడ్డి సూచనలతో నిజాంపేట సర్కిల్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్‌లో దళిత సంఘాలు మరియు కాంగ్రెస్ నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. 273వ డివిజన్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎర్రోళ్ల విష్ణు, గజ్జల మల్లికార్జున్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, బాబు…

Read More

కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద వార్: కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల రాళ్లదాడి!

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు (KCR) ఫామ్‌హౌస్ సమీపంలో ఉన్న డామరకుంట వద్ద మంగళవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీఆర్‌ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కేసీఆర్ ఫామ్‌హౌస్‌ ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు పిలుపునివ్వడంతో ఈ వివాదం మొదలైంది. ఘటన వివరాలు & ప్రస్తుత పరిస్థితి:

Read More

మద్నూర్‌లో మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం

మద్నూర్, సెప్టెంబర్ 8:(E6tv న్యూస్: ప్రతినిధి). మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం అంతర పాఠశాలల మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. సర్పంచ్ ఉష, ఎంఈవో రాములు క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభను కనబరచాలని ఆకాంక్షించారు. క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, సమష్టి భావన పెంపొందుతాయని తెలిపారు. రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఈ పోటీల్లో మండలంలోని…

Read More

వ్యవసాయ పరిశోధనా కేంద్రం ముధోల్‌లో సరస్వతి శిశు మందిర్ విద్యార్థుల క్షేత్ర సందర్శన

ముధోల్, సెప్టెంబర్ 8: (E6tv NEWS: ప్రతినిధి). ముధోల్‌లోని వ్యవసాయ పరిశోధనా కేంద్రాన్ని భైంసాకు చెందిన శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యార్థులు క్షేత్ర సందర్శనలో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు డా. ఆకుల దినేష్ మరియు డా. కిషోర్ ఆధ్వర్యంలో మట్టి నమూనాల సేకరణ (Soil Sampling), నేల పరీక్షల ప్రాముఖ్యత, నేల ఆరోగ్యం మరియు పంటల పెరుగుదలలో నేల పోషకాల పాత్ర గురించి అవగాహన కల్పించారు.అలాగే ఎల్ నినో (El…

Read More

ట్రాన్స్‌జెండర్ల బలవంతపు వసూళ్లకు చెక్.. సైబరాబాద్ పోలీసుల వార్నింగ్!

ఇంటి గృహప్రవేశాలు, షాపుల ప్రారంభోత్సవాలు మరియు బహిరంగ ప్రదేశాలలో కొంతమంది ట్రాన్స్‌జెండర్లు డబ్బుల కోసం ప్రజలను, వ్యాపారులను వేధిస్తున్నారనే ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ట్రాన్స్‌జెండర్ సమాజపు పెద్దలు, ప్రతినిధులతో పోలీసులు కౌన్సెలింగ్ సెషన్ నిర్వహించారు. సమావేశంలో ప్రధానాంశాలు & పోలీసుల సూచనలు: ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Read More

అసెంబ్లీలో BRS ఎమ్మెల్యేల ప్లకార్డుల నిరసన: కేసులపై, అరెస్టులపై మండిపాటు!

తెలంగాణ శాసనసభ లాబీలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్లకార్డులతో నిరసనకు దిగారు. తమ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు తీవ్ర అభ్యంతరకరంగా ప్రవర్తించారని, ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలపై అక్రమంగా కేసులు నమోదు చేస్తూ అరెస్టులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ సభలో ఆందోళన చేపట్టారు. దేవిరెడ్డి సుధీర్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రధాన డిమాండ్లు & ఆరోపణలు: అరెస్టులు, పోలీసు నిర్బంధాలతో తమ గొంతును నొక్కలేమని తేల్చిచెప్పిన…

Read More

స్పీకర్‌పై బెదిరింపు వ్యాఖ్యలు సహించం: సభలో మంత్రి శ్రీధర్ బాబు!

శాసనసభాపతి (Speaker) స్థానానికి ఉన్న అత్యున్నత గౌరవాన్ని మంటగలిపేలా బీఆర్‌ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీశ్‌రావు బెదిరింపు ధోరణిలో మాట్లాడటం తీవ్ర అభ్యంతరకరమని రాష్ట్ర శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన స్థానంలో ఉన్న స్పీకర్‌ను శాసించడానికి, “ఇలా చేయాలి.. అలా చేయకూడదు” అని ఆదేశించడానికి ప్రతిపక్ష నేతలకు ఉన్న హక్కు ఏమిటని ఆయన సూటిగా నిలదీశారు. సభలో మంత్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలు: చట్టసభ నిబంధనల ప్రకారం అసెంబ్లీని,…

Read More