Breaking News
ఎంపీ రఘురాంరెడ్డికి ఘన స్వాగతం
ఏఏఐ బృందం సర్వేలో ఎంపీతో కలిసి పాల్గొన్న కొత్వాల కొత్తగూడెం, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి).ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాంరెడ్డి ఏఏఐ బృందంతో కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా డీసీఎంఎస్ మాజీ చైర్మన్, రాష్ట్ర మార్క్‌ఫెడ్ మాజీ డైరెక్టర్, పాల్వంచ సొసైటీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు ఘన స్వాగతం పలికారు.సోమవారం సుజాతనగర్ మండలం నాయకులగూడెం వద్ద జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవిప్రసన్నతో కలిసి ఎంపీ రఘురాంరెడ్డికి కొత్వాల శాలువా కప్పి…
నీట్‌లో ప్రతిభ.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు
గిరిజన విద్యార్థినికి రూ.50 వేల ఆర్థిక సహాయం అభినందించిన ఐటీడీఏ పీవో బి. రాహుల్ భద్రాచలం, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి).నిరుపేద కుటుంబానికి చెందిన గిరిజన విద్యార్థిని భూక్య వాసిని నీట్ అడ్వాన్స్–2026లో ప్రతిభ కనబరిచి, స్టేట్ ర్యాంక్ 1962 సాధించి మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించడం అభినందనీయమని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. సోమవారం తన ఛాంబర్‌లో విద్యార్థినిని అభినందించిన పీవో.. గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యనభ్యసించి,…
అర్హత కలిగిన నాన్ టీచింగ్ సిబ్బందికి పదోన్నతులు
పదోన్నతి అర్హత పత్రాలు అందజేసిన ఐటీడీఏ పీవో బి. రాహుల్ భద్రాచలం, సెప్టెంబర్8:(E6tv NEWS: ప్రతినిధి).గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థలు, ఖమ్మం రీజియన్ పరిధిలో పనిచేస్తున్న అర్హత కలిగిన నాన్ టీచింగ్ సిబ్బందికి పదోన్నతులు కల్పించి, పదోన్నతి అర్హత పత్రాలను అందజేసినట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ తెలిపారు.సోమవారం తన ఛాంబర్‌లో ఉద్యోగులకు పదోన్నతి పత్రాలను అందజేశారు. వి. పృధ్వీరాజు, బి. కిరణ్‌లకు జూనియర్ అసిస్టెంట్లుగా, ఎస్. సత్యం, వి. సంతోష్ కుమార్, పి. రామదాస్‌లకు…
గిరిజన దర్బార్ వినతులకు సత్వర పరిష్కారం
ప్రతి విన్నపాన్ని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి: ఐటీడీఏ పీవో బి. రాహుల్ భద్రాచలం, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి).గిరిజన దర్బార్‌లో ఆదివాసీ గిరిజనులు సమర్పించే ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అధికారులను ఆదేశించారు. సోమవారం భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో వివిధ ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనుల నుంచి వినతులు, సమస్యలపై ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు. ఐటీడీఏ సహాయ…
ప్రజావాణి వినతులకు సత్వర పరిష్కారం చూపాలి
ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ మండలాల్లోనూ ప్రజావాణి నిర్వహణతో ప్రజలకు చేరువగా పాలన పాల్వంచ, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి).ప్రజల నుంచి స్వీకరించే ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా అధికారులు బాధ్యతతో పనిచేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందనతో కలిసి…
అసెంబ్లీనా.. కౌరవసభనా?
ప్రజాస్వామ్య సభలో పోలీసు రాజ్యం అంటూ బీఆర్‌ఎస్ నేతల ఆగ్రహం మఠంపల్లి, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి). అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారంటూ బీఆర్‌ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలవాల్సిన అసెంబ్లీలోనే ప్రజాప్రతినిధులపై పోలీసుల దాడులు జరగడం ఏమిటని ప్రశ్నిస్తూ సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.మండల బీఆర్‌ఎస్ నాయకులు ఇరుగు పిచ్చయ్య, మన్నెం శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో…
తాళ్ల రాంపూర్, దోమచందాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
తాళ్ల రాంపూర్, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతిని) ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన స్మార్ట్ రేషన్ కార్డులను తాళ్ల రాంపూర్, దోమచందా గ్రామాల్లో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఆయా గ్రామాల గ్రామపంచాయతీ కార్యాలయాల్లో జరిగిన కార్యక్రమాల్లో తహసీల్దార్‌తో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొని కార్డులను పంపిణీ చేశారు.తాళ్ల రాంపూర్ గ్రామంలో ఇన్‌చార్జి సర్పంచ్ చాట్ల జనార్ధన్, దోమచందా గ్రామంలో సర్పంచ్ పెద్దకాపుల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్…
కుంటాలలో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌కు రూ.9 కోట్ల నిధులు
కుంటాల, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి). కుంటాల మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌ను అప్‌గ్రేడ్ చేస్తూ తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా మార్చేందుకు ప్రభుత్వం జీవో విడుదల చేసిందని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలిపారు. పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు ప్రభుత్వం రూ.9 కోట్ల నిధులు మంజూరు చేసిందని ఆయన వెల్లడించారు. ఈ నిధులతో పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణంతో పాటు మౌలిక వసతుల కల్పన, విద్యార్థులకు అవసరమైన ఇతర సౌకర్యాలను మెరుగుపరచనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు….
మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దాడి తెలంగాణ సమాజానికే అవమానం: మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి!
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ గేటు వద్ద బీఆర్‌ఎస్ మహిళా ప్రజాప్రతినిధులపై పోలీసులు ప్రవర్తించిన తీరుపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇది కేవలం తనకు, సునీతా లక్ష్మారెడ్డికి జరిగిన పరాభవం కాదని, మొత్తం తెలంగాణ మహిళా సమాజానికే జరిగిన తీవ్ర అవమానమని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు నిరసనగా నల్ల టీషర్టులతో అసెంబ్లీకి వచ్చిన తమను పోలీసులు అమానుషంగా అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు. సబితా ఇంద్రారెడ్డి ఆరోపణలు & ముఖ్యాంశాలు: అసెంబ్లీ…
ఎమ్మెల్యేలను అడ్డుకోవద్దు: పోలీసులకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు!
హైదరాబాద్: తెలంగాణ శాసనసభకు వెళ్లే ఎమ్మెల్యేలను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోవద్దని రాష్ట్ర పోలీసులను తెలంగాణ హైకోర్టు సోమవారం తీవ్రంగా ఆదేశించింది. ప్రజాప్రతినిధులు సభ నిబంధనలు ఉల్లంఘిస్తే ఆ వ్యవహారాన్ని స్పీకర్ చూసుకుంటారని, అంతే తప్ప పోలీసులు వారిని అడ్డుకోకూడదని న్యాయస్థానం స్పష్టం చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ వద్ద జరిగిన ఉద్రిక్త పరిణామాలు, ఆందోళనల నేపథ్యంలో లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఆదేశాల్లోని…

