Breaking News
ఎస్‌ఐఆర్‌పై ప్రజలకు అవగాహన కల్పించిన నిర్మల్ రూరల్ ఎంఆర్‌ఓ రాజు
నిర్మల్,ఆగస్టు 28:(E6tv NEWS: ప్రతినిధి).ఎస్‌ఐఆర్ (ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ) ప్రక్రియపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేసేందుకు నిర్మల్ రూరల్ ఎంఆర్‌ఓ రాజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం వైయస్సార్ కాలనీలో పర్యటించిన ఆయన స్థానిక ప్రజలకు ఎస్‌ఐఆర్ ప్రక్రియపై వివరించారు. నోటీసులకు ఆధారాలు జత చేయాలి ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు అందుకున్న ప్రతి ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎంఆర్‌ఓ రాజు తెలిపారు. నోటీసుతో పాటు తమ వద్ద ఉన్న…
విద్యా.. వైద్య రంగాల బలోపేతమే ధ్యేయం
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, నాణ్యమైన విద్యపై ప్రత్యేక దృష్టి పీహెచ్‌సీల్లో మందుల కొరత లేకుండా చూడాలి.. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు జుక్కల్, ఆగస్టు 28: (E6tv NEWS: ప్రతినిధి).నియోజకవర్గంలో విద్యా, వైద్య రంగాలను మరింత బలోపేతం చేసి పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు అన్నారు.జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ…
పేదల సంక్షేమమే ధ్యేయం.. అర్హులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు
జుక్కల్ క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జుక్కల్, ఆగస్టు 28:(E6tv NEWS: ప్రతినిధి) పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. జుక్కల్ నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల…
రూ.30 లక్షలతో ఐకేపీ గోడౌన్ నిర్మాణానికి భూమిపూజ
మారుమూల గ్రామాల్లో ధాన్యం నిల్వకు ఉపయోగకరం – సర్పంచులు, తండా పెద్దమనుషులు మానాల, ఆగస్టు 28:(E6tv NEWS: ప్రతినిధి). ఉమ్మడి మానాల గ్రామపంచాయతీ పరిధిలోని స్కూల్ తండా గ్రామపంచాయతీలో రూ.30 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఐకేపీ గోడౌన్‌కు భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఉమ్మడి మానాల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచులు, తండా పెద్దమనుషులు, ప్రజాప్రతినిధులు కలిసి భూమిపూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాల్లో గోడౌన్ల నిర్మాణం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. కొనుగోలు…
ఏర్గట్లలో వైభవంగా జంధ్యాల పౌర్ణమి వేడుకలు
శాస్త్రోక్తంగా నూతన యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం జంధ్యాల పౌర్ణమి వేడుకలు ఏర్గట్ల, ఆగస్టు 28:(E6tv NEWS: ప్రతినిధి). బాల్కొండ నియోజకవర్గంలోని ఏర్గట్ల మండల కేంద్రంలో శ్రీ శివమార్కండేయ మాతృ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జంధ్యాల పౌర్ణమి (నూతన యజ్ఞోపవీత ధారణ) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.సమాజ శ్రేయస్సును కాంక్షిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య నూతన యజ్ఞోపవీత ధారణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ…
ముందస్తు టికెట్ బుకింగ్ సద్వినియోగం చేసుకోండి
ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజినల్ మేనేజర్ ఎస్.వి.జి. కృష్ణమూర్తి విజ్ఞప్తి నిజామాబాద్, ఆగస్టు 28:( E6tv NEWS: ప్రతినిధి). ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ అందిస్తున్న ముందస్తు టికెట్ బుకింగ్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ రీజినల్ మేనేజర్ ఎస్.వి.జి. కృష్ణమూర్తి ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.ముందస్తుగా రిజర్వేషన్ చేసుకుని టికెట్లు బుక్ చేసుకోవడం ద్వారా ప్రయాణికులు తమకు అనుకూలమైన సమయానికి సౌకర్యవంతంగా ప్రయాణించే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ప్రయాణానికి ముందుగానే టికెట్ బుక్ చేసుకోవడం వల్ల చివరి…
సుల్తాన్‌పేట్‌లో SIR–2026పై గ్రామసభ
మద్నూర్, ఆగస్టు 27: (E6tv NEWS: ప్రతినిధి). మద్నూర్ మండలం సుల్తాన్‌పేట్ గ్రామంలో SIR–2026 ఓటరు నమోదు ప్రక్రియలో భాగంగా గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ తహసీల్దార్ పాల్గొని ఓటరు జాబితాలో పేర్ల నమోదు, వివరాల్లో మార్పులు, అనర్హుల పేర్ల తొలగింపు తదితర అంశాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఓటరు నమోదు ప్రక్రియలో ఏవైనా తప్పులు, అవకతవకలు లేదా నిబంధనల ఉల్లంఘనలు గుర్తించినట్లయితే వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లే విధానాన్ని తహసీల్దార్ వివరించారు. ప్రతి…
రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ శుభాకాంక్షలు
నిజామాబాద్, ఆగస్టు 27:(E6tv NEWS: ప్రతినిధి) రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ప్రయాణికులు తమ కుటుంబ సభ్యులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేలా టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.పండుగ నేపథ్యంలో బస్టాండ్లు, ప్రధాన రహదారులు, రద్దీ ప్రాంతాల్లో టీజీఎస్‌ఆర్టీసీ సూపర్‌వైజర్లు, ప్రత్యేక అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రయాణికుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అవసరమైన ప్రాంతాల్లో అదనపు బస్సులను ఏర్పాటు చేసి ప్రయాణికులను సురక్షితంగా వారి స్వస్థలాలకు చేరవేస్తున్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన…
తెలంగాణలో ఆకాశాన్నంటిన ఉల్లిపాయల ధరలు: సప్లై పెంచేందుకు కేంద్రం ‘కాందా ఎక్స్‌ప్రెస్’ ప్రారంభం
తెలంగాణలో నిత్యావసర వస్తువైన ఉల్లిపాయల ధరలు ఒక్కసారిగా విపరీతంగా పెరగడంతో సామాన్య ప్రజలు, గృహిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో తెల్ల ఉల్లిపాయల (White Onion) ధర కిలో దాదాపు రూ. 100 దాటగా, ఎర్ర ఉల్లిపాయల (Red Onion) ధర రూ. 60 నుండి రూ. 70 వరకు పలుకుతోంది. ధరల పెరుగుదలకు కారణాలు & తాజా పరిస్థితి: కేంద్ర ప్రభుత్వ చర్యలు – ‘కాందా ఎక్స్‌ప్రెస్’: ధరలను అదుపులోకి తీసుకురావడానికి మరియు సరఫరాను…
నాగార్జునసాగర్ నీటి తరలింపుపై రేవంత్ ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నుంచి అక్రమంగా నీటిని తరలిస్తుంటే ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వీక్షకుడిలా చూస్తున్నారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీ నీటి తరలింపును తక్షణమే అడ్డుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును (KRMB) ఆయన డిమాండ్ చేశారు. ప్రధాన ఆరోపణలు & ముఖ్యాంశాలు:

