Breaking News
దినేష్ కులచారి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు
జక్రాన్‌పల్లి, ఆగస్టు 31:(E6tv NEWS: ప్రతినిధి) నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులచారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జక్రాన్‌పల్లి మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలోని శ్రీ శివలింగేశ్వర స్వామి ఆలయంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ సందర్భంగా దినేష్ కులచారి సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజాసేవలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని శ్రీ శివలింగేశ్వర స్వామివారిని ప్రార్థించారు. అనంతరం అంకాపూర్‌లోని లాలన వృద్ధాశ్రమాన్ని సందర్శించి…
ఆర్టీసీ బస్సులో భద్రత గాలికేనా..?
బాన్సువాడ డిపో ఎక్స్‌ప్రెస్ బస్సులో ప్రమాదకర పరిస్థితులు TS16UC3338 బస్సు లో ఉన్న ప్రయాణికుల ఆందోళన.. చర్యలు తీసుకోవాలని డిమాండ్ నిజామాబాద్ ఆగస్టు 31:(E6tv NEWS: శివ ఠాకూర్). ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ఆర్టీసీ బస్సుల్లోనే భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బాన్సువాడ డిపోకు చెందిన TS16UC3338 ఎక్స్‌ప్రెస్ బస్సులో ప్రయాణికులకు ప్రమాదకరంగా మారే పరిస్థితులు ఉన్నాయంటూ ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బస్సులో ప్రయాణించే సమయంలో ప్రయాణికులు కాలు పెట్టే ప్రదేశాల్లో ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయని,…
దుర్గం చెరువులో కలుషిత నీరు చేరి భారీగా చేపల మృతి: ₹20 లక్షల పరిహారం చెల్లించాలని మత్స్యకారుల డిమాండ్
హైదరాబాద్ జూబ్లీహిల్స్ సమీపంలోని దుర్గం చెరువులో రసాయనాలు, పారిశ్రామిక వ్యర్థాలతో కూడిన కలుషిత నీరు చేరడంతో భారీ ఎత్తున చేపలు మృత్యువాత పడ్డాయి. ఈ విషయాన్ని రాయదుర్గం మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు నీలం సురేందర్ ఆదివారం ధ్రువీకరించారు. చేపల మృతితో లక్షలాది రూపాయల నష్టం వాటిల్లిందని, మత్స్యకార కుటుంబాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన సమస్యలు & మత్స్యకారుల డిమాండ్లు: ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపరిహారం చెల్లించకపోతే మత్స్యకార సంఘాల ఆధ్వర్యంలో…
నేపాల్ వరదలు: సురక్షితంగా బయటపడ్డ ఒక తెలంగాణవాసి, ఇంకా లభ్యంకాని 21 మంది చిరునామా
నేపాల్‌లో సంభవించిన ప్రాణాంతక ఆకస్మిక వరదల (Flash Floods) ఘటనలో తెలంగాణకు చెందిన అల్లి ఇలేష్ సురక్షితంగా ఉన్నారని, ఆయన కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరిపారని రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. కాగా, తెలంగాణకు చెందిన మరో 21 మంది ఇంకా గల్లంతై ఉన్నారు (గతంలో ఆగస్టు 27న 22 మంది గల్లంతైనట్లు ప్రభుత్వం తెలిపిన సంగతి తెలిసిందే). ప్రధాన ముఖ్యాంశాలు: ముందస్తు సలహా: నేపాల్ వెళ్లేముందు లేదా డిఎన్‌ఏ పరీక్షలు నిర్వహించే ముందు బాధితుల కుటుంబాలు…
మానాల ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ భవనాన్ని పరిశీలించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
మూడు నెలల్లో మిగిలిన పనులు పూర్తి చేయాలి: ఇంజనీరింగ్ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం విశాలమైన భవనంలోకి పాఠశాలను తరలిస్తే విద్యార్థులకు మెరుగైన వసతులు గిరిజన విద్యార్థులకు ఎంతో ప్రయోజనం: వేముల ప్రశాంత్ రెడ్డి మానాల,ఆగస్టు 31:(E6tv NEWS: ప్రతినిధి) మానాల మండల కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ నూతన భవన నిర్మాణ పనులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. నిర్మాణ పనులు నెమ్మదిగా కొనసాగుతుండటంపై ఆయన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారుభవన…
SIR ఫేజ్–2పై BLAలు, సూపర్వైజర్లకు శిక్షణ
మోర్తాడ్, ఆగస్టు 30:(E6tv NEWS: ప్రతినిధి). బాల్కొండ నియోజకవర్గ స్థాయి BLAలు (బూత్ లెవెల్ ఏజెంట్లు), BLA సూపర్వైజర్లకు SIR ఫేజ్–2పై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని RNB ఫంక్షన్ హాల్‌లో ఈ సమావేశం జరిగింది.కార్యక్రమానికి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్, SIR ఇంచార్జ్ ఊట్ల వరప్రసాద్ హాజరై BLAలు, సూపర్వైజర్లకు SIR ప్రక్రియపై అవగాహన కల్పించారు. SIR ఫేజ్–2లో భాగంగా నోటీసులు అందుకున్న ప్రతి ఓటరు BLO…
ఇరిగేషన్ జాగా కబ్జాపై అధికారుల చర్యలు
కబ్జా చేసిన స్థలంలో అక్రమ నిర్మాణాలు నిలిపివేత స్థలం ఖాళీ చేయకపోతే రెవెన్యూ, పోలీస్ శాఖల సహకారంతో కఠిన చర్యలు ఇరిగేషన్ ఏఈ రవికుమార్ హెచ్చరిక రుద్రూర్, ఆగస్టు 30:(E6tv NEWS ప్రతినిధి).నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం సులేమాన్ ఫారం గ్రామంలో ఇరిగేషన్ శాఖకు సంబంధించిన స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న ఘటనపై అధికారులు చర్యలు చేపట్టారు. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న ఇరిగేషన్ శాఖ ఏఈ రవికుమార్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని…
చెన్నమ్మ కోరి దేవస్థానంలో భక్తుల సందడి
మద్నూర్, ఆగస్టు 29:(E6tv NEWS: ప్రతినిధి). కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం కుర్చీర్ గ్రామంలోని కోడిచీర శివారులో వెలసిన చెన్నమ్మ కోరి దేవస్థానంలో శ్రావణ శనివారం సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. చిన్న ఎక్లార గ్రామస్తులు, భక్తుల ఆధ్వర్యంలో దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు దేవస్థానానికి చేరుకుని చెన్నమ్మ కోరి అమ్మవారిని దర్శించుకుని…
ఎస్‌ఐఆర్‌పై ప్రజలకు అవగాహన
నిర్మల్, ఆగస్టు 30: (E6tv NEWS: ప్రతినిధి) నిర్మల్ జిల్లా కేంద్రంలోని బుధవారపేట మోచి సంఘంలో ఎస్‌ఐఆర్ (SIR) ఫామ్ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక కాంగ్రెస్ కౌన్సిలర్ కత్తి నరేందర్, బీఎల్‌ఓ ఇంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు ఎస్‌ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. ఓటర్లు తమకు అందిన నోటీసుతో పాటు, పాత ఓటర్ జాబితా లేదా 2002…
తెలంగాణ శాసనసభ సమావేశాలు: సెప్టెంబర్ 2 నాటికి ప్రశ్నలు సమర్పించాలని ఎమ్మెల్యేలకు సూచన
తెలంగాణ శాసనసభ రాబోయే వర్షాకాల సమావేశాల (Monsoon Session) నేపథ్యంలో, ప్రజోపయోగకరమైన అంశాలపై సభ్యులు అడిగే ప్రశ్నల నోటీసులను సెప్టెంబర్ 2, 2026 నాటికి సమర్పించాలని అసెంబ్లీ కార్యదర్శి రెండ్ల తిరుపతి శాసనసభ్యులకు (MLAs) లేఖలు రాశారు. ముఖ్య వివరాలు:

