Breaking News

190 మందికి కళ్యాణలక్ష్మీ – షాదీ ముబారక్ చెక్కులు, 299 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ఉత్తర్వుల పంపిణీ.

రూ.16.85 కోట్లకు పైగా సంక్షేమ సహాయం అందజేసిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి నిజామాబాద్, జూలై 17: E6 న్యూస్, శివ ఠాకూర్.తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేస్తున్నామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు. శుక్రవారం గూపన్‌పల్లి బైపాస్ రోడ్డులోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు, ఇందిరమ్మ ఇండ్ల…

Read More

గోమాతను రాష్ట్ర మాతగా ప్రకటించాలి

40 కోట్ల సంతకాల సేకరణలో అందరూ భాగస్వాములు కావాలిఈనెల 27న గో సమ్మన్ ఆహ్వాన అభ్యాన్ యాత్రను విజయవంతం చేయండి: రాజ్ పురోహిత్ సింగ్ నిజామాబాద్ జూలై 17: E6 న్యూస్, శివ ఠాకూర్. గోమాతను రాష్ట్ర మాతగా ప్రకటించాలని కోరుతూ దేశవ్యాప్తంగా చేపట్టిన గో సమ్మన్ ఆహ్వాన అభ్యాన్ కార్యక్రమంలో భాగంగా దుబ్బాకలోని శ్రీకృష్ణ మందిర్ గోశాల వద్ద సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు గో సమ్మన్ ఆహ్వాన అభ్యాన్ జిల్లా ప్రతినిధులు రాజ్ పురోహిత్…

Read More

కాంగ్రెస్ పార్టీలో చేరిన రాంనగర్ సర్పంచ్ స్వామి

ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్‌కు గుడ్‌బై.. 100 మంది కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్‌లో చేరిక నిజామాబాద్, జూలై 17: E6 న్యూస్ శివ ఠాకూర్.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు.శుక్రవారం నిజామాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రూరల్ మండలం రాంనగర్ గ్రామ సర్పంచ్ స్వామి, ఉప సర్పంచ్…

Read More

నందిపేట్ తహసిల్దార్‌పై సస్పెన్షన్ వేటు..?

నిబంధనలకు విరుద్ధంగా భూముల రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఆరోపణలు – సబ్ కలెక్టర్ విచారణ నివేదిక ఆధారంగా కలెక్టర్ చర్య నందిపేట్ జూలై 17 : E6 న్యూస్, శివ ఠాకూర్. నందిపేట్ తహసిల్దార్ సంతోష్ రెడ్డిపై జిల్లా యంత్రాంగం సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలుస్తోంది.. నిబంధనలకు విరుద్ధంగా భూముల రిజిస్ట్రేషన్లు నిర్వహించడం, లబ్ధిదారులతో కుమ్మక్కై అక్రమ మార్గంలో పట్టాలు జారీ చేసినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆయనను సస్పెండ్ చేస్తూ…

Read More

సాలూరా మండలంలో మంజీరా నుంచి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా

సాలూరా, జూలై 17: E6 న్యూస్, అశోక్ కాంబ్లే. సాలూరా మండలంలోని మంధర్నా, తగ్గేలి గ్రామాల పరిసరాల్లో ప్రవహిస్తున్న మంజీరా నది నుంచి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రతి రోజు రాత్రి వేళల్లో పదుల సంఖ్యలో ఇసుకతో నిండిన ట్రాక్టర్లు బోధన్ వైపు తరలిపోతున్నాయని వారు పేర్కొంటున్నారు. తగ్గేలి గ్రామ సమీపంలోని మంజీరా నది గర్భంలో డోజర్ల సహాయంతో రాత్రి సమయంలో పెద్దఎత్తున ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్నారని కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు….

Read More

ఎస్‌ఐఆర్ ప్రక్రియలో వేగం పెంచి 100 శాతం పూర్తి చేయాలి: డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నాగేష్ రెడ్డి

భీంగల్‌లో పోలింగ్ బూత్‌ల పరిశీలన.. కాంగ్రెస్ నాయకులకు కీలక సూచనలు భీంగల్, జూలై 17: E6 న్యూస్ శివ ఠాకూర్.ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను వేగవంతం చేసి వంద శాతం పూర్తి చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు కాటిపల్లి నాగేష్ రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియలో భీంగల్ పట్టణం వెనుకబడిన నేపథ్యంలో ఆయన శుక్రవారం అత్యవసరంగా భీంగల్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా పట్టణంలోని మొదటి…

Read More

ఫీజు రియంబర్స్మెంట్ విడుదల వరకు పోరాటం కొనసాగుతుంది: ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా

బీజేపీ ఆధ్వర్యంలో ‘ఇందూరు రణభేరి’ నిరసన.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు ఇందూరు, జూలై 17: E6 న్యూస్, శివ ఠాకూర్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పనిలో కమిషన్లకు పాల్పడుతూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా ఆరోపించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదలను డిమాండ్ చేస్తూ బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని ధర్నా చౌక్‌లో నిర్వహించిన ‘ఇందూరు రణభేరి’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ…

Read More

నిజామాబాద్‌లో నూతన ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్‌కు ఘన సన్మానం.

నిజామాబాద్, జూలై 17: E6 న్యూస్, శివ ఠాకూర్. ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా ఇటీవల పదోన్నతి పొంది బాధ్యతలు స్వీకరించిన డి. అరుణ్ కుమార్ ను టీఎన్జీఓఎస్ ఎక్సైజ్ సెంట్రల్ ఫోరమ్ ప్రతినిధులు, శాఖా సిబ్బంది ఘనంగా సన్మానించారు. నిజామాబాద్‌లోని అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో టీఎన్జీఓఎస్ ఎక్సైజ్ సెంట్రల్ ఫోరమ్ కేంద్ర ఉపాధ్యక్షులు కె. అరుణ్ కుమార్, డీపీఈఓ (DPEO) కార్యాలయ ఏఏఓ వి. నరసయ్య పాల్గొని నూతన అసిస్టెంట్…

Read More

గ్రామ అభివృద్ధి కమిటీ వేధింపుల వల్లే ఆత్మహత్యాయత్నం..?

చేయని నేరానికి జరిమానా విధించారని యువకుడి ఆరోపణ రైలు పట్టాలపై విషం తాగి ఆత్మహత్యాయత్నం.. బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స బోధన్, జూలై 17: E6 న్యూస్, అశోక్ కాంబ్లే. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం రాంపూర్ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ విధించిన జరిమానా, వేధింపుల కారణంగానే ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడనే ఆరోపణలు వెలువడ్డాయి. స్థానికుల వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన ఇద్దరు యువకులపై గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తాము చేయని నేరానికి…

Read More

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ అధికారులు

ఎన్‌వోసీ జారీకి రూ.60 వేల లంచం డిమాండ్ – ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్‌ను పట్టుకున్న ఏసీబీ అధికారులు ఆదిలాబాద్, జూలై 16: E6 న్యూస్ ఆదిలాబాద్ జిల్లాలో అవినీతిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో విజయవంతమైన దాడి నిర్వహించారు. ఇరిగేషన్ శాఖకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాథోడ్ విఠల్, అసిస్టెంట్ ఇంజనీర్ రూపావతి రమేష్‌ను రూ.60 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రంగేహస్తం పట్టుకున్నారు.ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఆదిలాబాద్…

Read More