Breaking News

నర్సాపూర్ లో బాధిత కుటుంబాలను పరామర్శించిన మానాల మోహన్ రెడ్డి.

కమ్మర్పల్లి: E6 న్యూస్ (తాటికొండ గంగాధర్)

కమ్మర్పల్లి మండలంలోని నర్సాపూర్ గ్రామంలో రాష్ట్ర కోఆపరేటివ్ యూనిట్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి పలువురు బాధిత కుటుంబాలను పరామర్శించారు. పోడెండ్ల సంజీవ్ కుమారుడికి ఇటీవల శస్త్రచికిత్స జరగడంతో వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి ధైర్యం చెప్పారు.

అలాగే కువైట్ గంగాధర్ కుమార్తె ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబాన్ని సందర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మండల శేఖర్ తండ్రి ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో కమ్మర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భాస్కర్, ఎన్‌ఎస్‌యూఐ మండల అధ్యక్షుడు వేణు, మాజీ మండల అధ్యక్షుడు సుంకేట రవి, తిప్పిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కుకునూర్ సర్పంచ్ భూమారెడ్డి, ఇనాయత్‌నగర్ సర్పంచ్ రాములు, ఉప సర్పంచ్ అనిల్, డీసీ తండా సర్పంచ్ దేవేందర్, రాకేష్, వెంకట్, గణేష్, వెంకటేష్, క్యాతం గంగారెడ్డి, ముసల నవీన్, శ్రవణ్, మల్లేష్, కచ్చకాయల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *