Breaking News

రైతు భరోసా సంబరాలు

సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన డీసీసీ అధ్యక్షుడు కాట్‌పల్లి నగేష్ రెడ్డి

నిజామాబాద్, జూలై 8:E6సిక్స్ న్యూస్ (శివ ఠాకూర్).

రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద 124.85 లక్షల ఎకరాలకు సంబంధించిన 68.37 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.7,490.72 కోట్లను జమ చేసిన సందర్భంగా బుధవారం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు కాట్‌పల్లి నగేష్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచి ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కాట్‌పల్లి నగేష్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ రైతు భరోసా నిధులను వారి ఖాతాల్లో జమ చేయడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో నిజామాబాద్ కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, డీసీసీ కోశాధికారి భక్తవత్సలం, డీసీసీ ఉపాధ్యక్షులు రత్నాకర్ గౌడ్, గాదరి గోపి, పాషా, రజిత యాదవ్, ముస్కు వెంకట్ రెడ్డి, అమృతాపూర్ గంగాధర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *