ఇందూరు, జూలై 12: E6 న్యూస్ శివ ఠాకూర్
నియోజకవర్గంలోని పేదలకు మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, అవసరమైన వారికి నిమ్స్‌లో చికిత్స కోసం ఎల్వోసీలు (LOC) మంజూరు చేస్తున్నామని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు.ఆదివారం నగరంలోని తన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆటోనగర్‌కు చెందిన మూడున్నరేళ్ల చిన్నారి ఉమ్మే కుర్సుం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండటంతో ఆమె చికిత్స నిమిత్తం రూ.5 లక్షల విలువైన ఎల్వోసీని కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్స పొందలేని పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి అవసరమైన వైద్య సహాయం అందేలా ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజల ఆరోగ్య సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.పార్టీలకు అతీతంగా పేదల ప్రాణాలను కాపాడటమే తన లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

