Breaking News

కాలేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ వైఖరిని ఖండించిన బిఆర్ఎస్ నేతలు

కోటగిరి జూలై 12 :E6 న్యూస్:కోటగిరి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిని పార్టీ నాయకులు తీవ్రంగా విమర్శించారు. ప్రాజెక్టుపై జరుగుతున్న దుష్ప్రచారాలను ఖండిస్తూ, తెలంగాణ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కాళేశ్వరం ప్రాజెక్టును సమర్థవంతంగా వినియోగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలోని సాగునీటి అవసరాలను తీర్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో ఉపయోగించి, రైతులకు తక్షణమే సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతుల సంక్షేమాన్ని పక్కనబెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాజెక్టును వివాదాస్పదం చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో యలమంచిలి శ్రీనివాసరావు, నార్ల రత్నకుమార్, మొరే కిషన్, తెల్ల రవి, సూడెం నవీన్, గంగా ప్రసాద్ గౌడ్, వై.ఎస్. దాస్, గంగప్ప, ఆనంద్ సెరుపులే తదితర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *