ఒక వ్యక్తి అరెస్టు.. పల్సర్ ద్విచక్ర వాహనం సీజ్
నిజామాబాద్, జూలై 14: E6 క్రైమ్ న్యూస్
నిజామాబాద్ SHO పోలీస్ స్టేషన్ పరిధిలోని బబన్సా పహాడ్ ప్రాంతంలో ఎన్ఫోర్స్మెంట్ బృందం నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో 152 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుంది. ఈ ఘటనలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.
దాడుల సందర్భంగా నిందితుడి వద్ద నుంచి 152 గ్రాముల ఎండు గంజాయితో పాటు బజాజ్ పల్సర్ ద్విచక్ర వాహనాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేశారు.
తదుపరి న్యాయ ప్రక్రియ నిమిత్తం అసలు కేసు పత్రాలు, స్వాధీనం చేసుకున్న నిషేధిత వస్తువులు, అలాగే నిందితుడిని నిజామాబాద్ SHO పోలీసులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు హెచ్చరించారు.

