- జిల్లాలోని పలు పట్టణాల్లో వరుసగా రథయాత్రలు నిర్వహణ
- జూలై 24న కంటేశ్వర్ ఆలయం నుంచి శ్రీరామ గార్డెన్ వరకు నిజామాబాద్ నగరంలో మహా రథయాత్ర
- భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రామానంద రాయ్ గౌరదాస్ పిలుపు
ఇస్కాన్ రథయాత్రలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొనాలి
జూలై 15 నిజామాబాద్: E6 న్యూస్ శివ ఠాకూర్ ఇస్కాన్ (ISKCON) ఇందూరు జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా శ్రీ జగన్నాథ రథయాత్రలు నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా రథయాత్ర జరిగే ప్రాంతాల్లో భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని రామానంద రాయ్ గౌర దాస్ విజ్ఞప్తి చేశారు.

రథయాత్రల షెడ్యూల్ ప్రకారం జూలై 16న ఆర్మూర్, 17న బషీర్బాగ్, మోర్తాడ్, కమ్మర్పల్లి, 18న ఇందల్వాయి, 19న బోధన్, 20న నవీపేట్, 22న నందిపేట్ ప్రాంతాల్లో రథయాత్రలు నిర్వహించనున్నారు.
చివరిగా జూలై 24న నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ ఆలయం నుంచి శ్రీరామ గార్డెన్ వరకు వైభవంగా శ్రీ జగన్నాథ రథయాత్ర కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ మహోత్సవంలో జిల్లా నలుమూలల నుంచి భక్తులు పాల్గొని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో శ్రీమాన్ హితయ్ చంద్, బలరాం ఆది గురుదాస్, ప్రజగ్న రామకృష్ణ దాస్, రథ రాజా గోపికేశ్వర్ దాస్, వినోద వెంకట దాస్, స్వామి యాదవ్, రఘుపతి గౌడ్, సునీల్ ప్రభు, రోహిత్ ప్రభు, సుమన్ ప్రభు, శ్రీపాద రామకృష్ణ దాస్, అరవింద్ ప్రభు, దామోదర్ ప్రభు, శివ జీవన్ కేశవ దాస్ తదితరులు పాల్గొన్నారు.

