Breaking News

దశల వారిగా గ్రామాల అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

దేగాం, బిజ్జూర్, లింగా గ్రామాల్లో అభివృద్ధి పనుల ప్రారంభం

మహిళా సమైక్య భవనాలు, పాఠశాల ప్రహరీ గోడ, జలసిరి కార్యక్రమానికి శ్రీకారం

ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు – విద్యార్థులతో మమేకమైన ఎమ్మెల్యే

బైంసా, జూలై 23: E6 tv NEWS తిరుపతి గౌడ్.

దశలవారీగా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. బైంసా మండలంలోని దేగాం గ్రామంలో రూ.7 లక్షలతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడను, బిజ్జూర్, లింగా గ్రామాల్లో రూ.10 లక్షల చొప్పున నిర్మించిన మహిళా సమైక్య భవనాలను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ఉపాధి హామీ పథకం ద్వారా సీసీ రోడ్లు, గోదాములు, మహిళా సమైక్య భవనాలు తదితర అభివృద్ధి పనులకు ఒక్కో గ్రామానికి రూ.50 లక్షల నుంచి రూ.కోటికి పైగా నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.గత పదేళ్ల పాలనలో నియోజకవర్గం పలు రంగాల్లో వెనుకబడిందని, ఇప్పుడు దశలవారీగా గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

విద్యార్థులతో మమేకమైన ఎమ్మెల్యే

దేగాం గ్రామంలోని జెడ్పీ హైస్కూల్‌ను సందర్శించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించారు. పాఠశాలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని, తరగతి గదులను పరిశీలిస్తూ విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

లింగా గ్రామంలో జలసిరి కార్యక్రమానికి శ్రీకారం

లింగా గ్రామంలో జలసిరి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నీటి కుంట నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నందున వి.బి. రాంజీ పథకం కింద నీటి కుంటలు, ఇంకుడు గుంతల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేకు మహిళలు డప్పు చప్పుళ్లు, పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు.

కార్యక్రమాల్లో డీఆర్‌డీఓ పీడీ విజయలక్ష్మి, ఎంపీడీవో నీరజ్ కుమార్, సీనియర్ నాయకులు సోలంకి భీమ్రావు, మాజీ ఎంపీపీ అబ్దుల్ రజాక్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు పండిత్‌రావు పటేల్, బీజేపీ మండల అధ్యక్షుడు, దేగాం సర్పంచ్ సిరం సుష్మారెడ్డి, లక్ష్మీ వెంకట్‌రెడ్డి, లింగా సర్పంచ్ గడపాలే సుష్మారాణి యశ్వంత్, ఆయా గ్రామాల సర్పంచులు, బీజేపీ నాయకులు, మాజీ ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *