నిజామాబాద్, జూలై 30: E6 tv NEWS ప్రతినిధి.
జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను దాదాపు 100 శాతం పూర్తి చేసేలా బీఎల్ఏలు సమర్థవంతంగా పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి సూచించారు.శుక్రవారం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా డీసీసీ అధ్యక్షులు కాట్‌పల్లి నాగేష్ రెడ్డి అధ్యక్షతన జిల్లా PAC సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లి ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీ నాయకులు వ్యక్తిగత భేదాభిప్రాయాలను పక్కనబెట్టి ఐకమత్యంతో పనిచేస్తే కాంగ్రెస్ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావడం సాధ్యమవుతుందని అన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు సముచిత గుర్తింపు, న్యాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్ రావు, మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర PAC కమిటీ సభ్యుడు ఈరవత్రి అనిల్, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, బాల్కొండ ఇంచార్జి సునీల్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, నూడా చైర్మన్ కేశ వేణు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజారెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్, జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షుడు నరేందర్ గౌడ్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు యాదగిరి, జిల్లా ఆర్‌జీపీఆర్‌ఎస్ అధ్యక్షుడు గంగాధర్ గౌడ్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు లింగం, జిల్లా ఫిషరీస్ సెల్ అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


