Breaking News

మట్టి వినాయక ప్రతిమలతోనే పర్యావరణ పరిరక్షణ

గ్రీన్ ఎర్త్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక ప్రతిమలు, మొక్కల పంపిణీ

పాల్వంచ, సెప్టెంబర్ 13: (E6tv NEWS: ప్రతినిధి)

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గ్రీన్ ఎర్త్ సొసైటీ సభ్యులు పిలుపునిచ్చారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని భజన మందిరం రోడ్డులో సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక ప్రతిమలు, మొక్కలను పంపిణీ చేశారు.

భారీ పరిశ్రమల కారణంగా పాల్వంచ ప్రాంతంలో పర్యావరణంపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో పర్యావరణహిత గణపతి ప్రతిమలను వినియోగించాలని నిర్వాహకులు సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారైన విగ్రహాలకు బదులుగా మట్టి వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించి పూజించాలని కోరారు. అలాగే అధిక శబ్దానికి కారణమయ్యే డీజేల వినియోగాన్ని తగ్గించాలని సూచించారు.ఈ సందర్భంగా గ్రీన్ ఎర్త్ సొసైటీ ప్రతినిధి రమేష్ రాథోడ్ మాట్లాడుతూ.. “మట్టి విగ్రహాల వైపే అడుగు వేద్దాం.. పర్యావరణ అనుకూల ప్రతిమలతోనే పూజిద్దాం.. ప్రకృతిని మనమే కాపాడుకుందాం” అని పిలుపునిచ్చారు. సామాజిక బాధ్యతగా 2012 నుంచి 2026 వరకు ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలతో పాటు మొక్కలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో ప్రకృతి ప్రేమికుడు, వండర్ కిడ్ ఇంగ్లాండ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హోల్డర్ విశ్వమిత్ర చౌహన్, సొసైటీ అధ్యక్షుడు సత్యనారాయణ, జేఏసీ చైర్మన్ వీరు నాయక్, జయరాం, ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్, వెంకట్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *