బాల్కొండ, సెప్టెంబర్ 13:(E6tv NEWS: ప్రతినిధి)
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు సట్ల ప్రవీణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్కొండ పట్టణ శాఖ అధ్యక్షుడు కుందారం శ్రీనివాస్‌తో పాటు మండల, జిల్లా కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి సట్ల ప్రవీణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సట్ల ప్రవీణ్ నాయకత్వంలో మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు పుప్పాల విద్యాసాగర్, సయ్యద్ రియాజ్ అలీ, మండల కార్యదర్శులు దోన్పాల్ సాయన్న, జక్క పద్మారావు, మాజీ ఉపసర్పంచ్ షేక్ వాహబ్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్లు సయ్యద్ మజారుద్దీన్, మహమ్మద్ అన్వర్, మైనార్టీ విభాగం మండల అధ్యక్షుడు షేక్ జావీద్, యువజన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు పెసరి వివేక్ ఆనంద్,మెట్టు అశోక్, సయ్యద్ ముజీబ్, నల్లూరి హరికృష్ణ, మార పురుషోత్తం, గడ్డం రవి, గోజుర్ గంగాధర్, గంగమల్లు, జెట్టి సాయి తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని సట్ల ప్రవీణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.


