Breaking News

శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

ప్రకృతి సిద్ధమైన విగ్రహాలతో అలరించిన విద్యార్థులు పాల్వంచ, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి) పట్టణంలోని ఒడ్డుగూడెం శ్రీ చైతన్య పాఠశాలలో శుక్రవారం వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆకులు, బంకమట్టి, క్లే, ధాన్యాలు, పప్పుధాన్యాలు, గోధుమ పిండితో స్వయంగా తయారు చేసిన వినాయక ప్రతిమలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాణి మిర్చాల మాట్లాడుతూ వినాయక చవితి జ్ఞానం, శ్రేయస్సు, అభ్యుదయానికి ప్రతీక అన్నారు. విఘ్నాలను తొలగించే విఘ్నహర్తగా వినాయకుడిని…

Read More

సాయుధ రైతాంగ పోరాటం అజరామరం

అమరుల ఆశయాల సాధనకు సమరశీల ఉద్యమాలు నిర్మించాలి: సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా సుజాతనగర్, సెప్టెంబర్ 11: (E6tv NEWS: ప్రతినిధి).  తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్ర అజరామరమని, నాటి వీరోచిత పోరాటాల స్ఫూర్తితో నేటి ప్రజా సమస్యలపై ఉద్యమించాలని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్‌.కె. సాబీర్ పాషా పిలుపునిచ్చారు. సాయుధ పోరాట వారోత్సవాల ప్రారంభ సభ శుక్రవారం సుజాతనగర్ మండలం నాయకులగూడెం గ్రామంలో నిర్వహించారు. రావి నారాయణరెడ్డి స్థూపం వద్ద…

Read More

అటవీ అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం

అటవీ సంపదతో పాటు గిరిజనుల హక్కుల పరిరక్షణకు సమన్వయంతో పనిచేయాలి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అటవీ నేరాల నియంత్రణ కొత్తగూడెం,సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి) విధి నిర్వహణలో అటవీ సంపద, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన అటవీ శాఖ అధికారులు, సిబ్బంది సేవలు, త్యాగాలు స్ఫూర్తిదాయకమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం కొత్తగూడెం ఇల్లందు క్రాస్‌రోడ్స్‌లోని చలమల శ్రీనివాసరావు మెమోరియల్ సెంట్రల్…

Read More

హుజూర్‌నగర్‌లో సెల్ టవర్ నిర్మాణంపై స్థానికుల అభ్యంతరం

నిర్మాణ పనులు నిలిపివేయాలని పురపాలక అధికారులకు వినతి హుజూర్‌నగర్, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి). హుజూర్‌నగర్ పట్టణంలోని ఏరియా ఆసుపత్రి ఎదురుగా చేపడుతున్న ఎయిర్‌టెల్ సెల్ టవర్ నిర్మాణంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నివాస ప్రాంతాలు, ఆసుపత్రికి సమీపంలో టవర్ ఏర్పాటు చేయడం వల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.టవర్ నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని కోరుతూ హుజూర్‌నగర్ పురపాలక సంఘం కమిషనర్, చైర్మన్‌కు స్థానికులు వినతిపత్రం సమర్పించారు….

Read More

మట్టి గణపతులను పూజిద్దాం

ఏర్గట్ల, సెప్టెంబర్ 11: (E6tv NEWS: ప్రతినిధి). వినాయక చవితిని పురస్కరించుకొని ఏరుగట్లలోని పీఎం శ్రీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో మట్టి గణపతుల తయారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు వివిధ ఆకృతుల్లో ఎంతో అందంగా మట్టి వినాయక విగ్రహాలను తయారు చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మట్టి గణపతుల ప్రాశస్త్యంతో పాటు వినాయక చవితి పండుగ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతులను వినియోగించడం ఎంతో ముఖ్యమని సూచించారు.పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కొమరగిరి…

Read More

అవుట్‌సోర్సింగ్‌కు వ్యతిరేకంగా ఉద్యోగుల నిరసన

పాల్వంచ, సెప్టెంబర్ 11: (E6tv NEWS: ప్రతినిధి). YTPS AHP, CHP విభాగాలను ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా అవుట్‌సోర్సింగ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ TGPEJAC ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జనరేటింగ్ ప్లాంట్లలో చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని KTPS VII STGలో ఉద్యోగులు నిరసన చేపట్టారు. KTPS VII STG చీఫ్ ఇంజనీర్ కార్యాలయం వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉద్యోగులు నిరసన ప్రదర్శన నిర్వహించారు….

Read More

నిరుపేదలకు విద్యుత్ సౌకర్యం కల్పించిన పత్తి రాము

మాజీ సొసైటీ చైర్మన్‌కు దళితులు, నిరుపేదల కృతజ్ఞతలు రుద్రూర్, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి)ఇల్లు లేని నిరుపేదలు, దళితుల సమస్యను పరిష్కరించేందుకు మాజీ సొసైటీ చైర్మన్ పత్తి రాము స్పందించి విద్యుత్ సౌకర్యం కల్పించడంతో లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో కొంతమంది నిరుపేదలు ప్రస్తుతం ఆవాసంగా ఉంటున్నారు. అయితే ఆయా ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ లేకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని…

Read More

పంచాయతీలకు శుభవార్త.. సొంత ఆదాయం ఇక గ్రామాభివృద్ధికే

ట్రెజరీలో జమ చేయాల్సిన అవసరం లేదు.. గ్రామసభ తీర్మానంతో స్థానిక అవసరాలకు వినియోగం పంచాయతీరాజ్‌ చట్టం-2018లోని సెక్షన్‌ 70(3)కు సవరణకు అసెంబ్లీ ఆమోదం హైదరాబాద్, సెప్టెంబర్ 11: (E6tv NEWS). తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై గ్రామ పంచాయతీలకు వచ్చే సొంత ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాలో జమ చేయాల్సిన అవసరం లేకుండా చర్యలు చేపట్టింది. పంచాయతీలు తమ ఆదాయాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకుని, గ్రామాభివృద్ధి, స్థానిక అవసరాల కోసం…

Read More

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం

కొత్తగూడెం, సెప్టెంబర్ 11: (E6tv NEWS: ప్రతినిధి). తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా కొత్తగూడెం రైల్వే స్టేషన్ వద్ద ఆమె చిత్రపటానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగా సీతారాములు మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ ధైర్యం, ఆత్మగౌరవం, పోరాట పటిమ తెలంగాణ ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమన్నారు. సామాజిక అన్యాయం, దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా ఆమె సాగించిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా…

Read More

స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన సర్పంచ్ అశోక్ పటేల్

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు రేషన్ సేవల్లో పారదర్శకత పెంచేందుకే స్మార్ట్ కార్డులు మద్నూర్, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి).మద్నూర్ మండలం మెనూర్ గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్ లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ అశోక్ పటేల్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి…

Read More