Breaking News

భీంగల్ ఐదో వార్డులో బోరు మోటార్ ప్రారంభం

15వ ఆర్థిక సంఘం నిధులతో ఏర్పాటు

తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు

భీంగల్: భీంగల్ పట్టణంలోని ఐదో వార్డు బోయగల్లిలోని జండాగల్లి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బోరు మోటార్‌ను ఐదో వార్డు కౌన్సిలర్ బోదిరే లావణ్య నరసయ్య ప్రారంభించారు. స్థానిక ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని బోరు మోటార్ ఏర్పాటు చేసినట్లు కౌన్సిలర్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వార్డులో తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉండేలా పురపాలక సంఘం ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.బోరు మోటార్ ఏర్పాటు పనులకు మున్సిపల్ ఫైనాన్స్ ద్వారా 15వ ఆర్థిక సంఘం నిధులను వినియోగించినట్లు పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నిధులను సద్వినియోగం చేస్తూ వార్డులో అభివృద్ధి పనులను కొనసాగిస్తామని తెలిపారు.బోరు మోటార్ అందుబాటులోకి రావడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ కౌన్సిలర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో నల్లూరు లింబాద్రి, లోకేష్, రఘు, రాకేష్, ఆకుల సుజాత, గంగామణితో పాటు వార్డు సభ్యులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *