Breaking News

మోర్తాడ్‌లో సెప్టెంబర్ 15న కాంగ్రెస్ బహిరంగ సభ

ముఖ్యఅతిథిగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క

హాజరుకానున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు

మోర్తాడ్:, సెప్టెంబర్ 13:(E6tv NEWS: ప్రతినిధి)

బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్ మండల కేంద్రంలో ఈ నెల 15వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. మోర్తాడ్ సండే మార్కెట్ వద్ద జరగనున్న ఈ సభకు నిజామాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.

ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ముత్యాల సునీల్ కుమార్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నగేష్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు.సభకు నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. సభలో పార్టీకి సంబంధించిన పలు అంశాలపై నాయకులు ప్రసంగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

కార్యక్రమాన్ని మీడియా ప్రతినిధులు కవర్ చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *