Breaking News

పాత విగ్రహాల గౌరవప్రదమైన నిమజ్జనం.. మల్కాజ్‌గిరి కార్పొరేషన్ ‘ప్రాజెక్ట్ ఉద్వాసన’!

హైదరాబాద్: పూజా గదుల్లో ఉండే పాతబడిన లేదా విరిగిపోయిన దేవుళ్ల చిత్రపటాలు, విగ్రహాలను ఎక్కడ పడితే అక్కడ పడేసి దైవాపచారం జరగకుండా చూసేందుకు మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC) నడుంబిగించింది. ‘లూప్ సస్టైనబిలిటీ’ స్వచ్ఛంద సంస్థ భాగస్వామ్యంతో ‘ప్రాజెక్ట్ ఉద్వాసన’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా పాత విగ్రహాలను, దేవుడి పటాలను సేకరించి, అత్యంత గౌరవప్రదంగా నిమజ్జనం లేదా పునర్వినియోగం చేస్తారు. ఈ గురువారం ప్రాజెక్ట్ వివరాలను వెల్లడించిన మల్కాజ్‌గిరి మున్సిపల్…

Read More

సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు

దీర్ఘాయుష్షు, సంపూర్ణ ఆయురారోగ్యాలతో ప్రజాసేవ కొనసాగించాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి జులై 24: E6 tv NEWS ప్రతినిధి. సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి  కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి  హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్  ప్రజాసేవలో నిరంతరం నిమగ్నమై రాష్ట్రాభివృద్ధికి మరింతగా కృషి చేయాలని ఆకాంక్షించారు. భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించాలని సీఎం తన సందేశంలో పేర్కొన్నారు. కేటీఆర్  దీర్ఘాయుష్షుతో ప్రజలకు…

Read More

నీట్ నిరసనలు.. విద్యార్థుల పోరాటమా? రాజకీయాల వేదికా?

జంతర్ మంతర్ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా చర్చ.. అసలు బాధ్యత ఎవరిది? విద్యార్థుల భవిష్యత్తు ఎటు? E6 ప్రత్యేక ప్రతినిధి: శివ ఠాకూర్. దేశంలో వైద్య విద్యకు ప్రవేశ ద్వారంగా భావించే నీట్ (NEET) పరీక్ష మరోసారి రాజకీయ, సామాజిక, విద్యా రంగాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల నిరసన, ఆ తర్వాత జరిగిన పోలీసు చర్యలు, రాజకీయ నాయకుల ప్రవేశం, విద్యార్థులపై నమోదయ్యే అవకాశమున్న కేసులు—ఇవన్నీ కలిసి ఒక…

Read More

దశల వారిగా గ్రామాల అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

దేగాం, బిజ్జూర్, లింగా గ్రామాల్లో అభివృద్ధి పనుల ప్రారంభం మహిళా సమైక్య భవనాలు, పాఠశాల ప్రహరీ గోడ, జలసిరి కార్యక్రమానికి శ్రీకారం ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు – విద్యార్థులతో మమేకమైన ఎమ్మెల్యే బైంసా, జూలై 23: E6 tv NEWS తిరుపతి గౌడ్. దశలవారీగా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. బైంసా మండలంలోని దేగాం గ్రామంలో రూ.7 లక్షలతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడను,…

Read More

రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం: పోతన్న యాదవ్

ముధోల్, జూలై 23: E6 tv NEWS (తిరుపతి గౌడ్) నీట్ పరీక్ష అంశంపై నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పోతన్న యాదవ్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్య దేశంలో ప్రజా సమస్యలపై ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికీ ఉందని, విద్యార్థుల తరఫున గొంతెత్తిన ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయడం…

Read More

దేశభక్తి కార్మిక సంక్షేమమే బీఎంఎస్ ధ్యేయం: ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ

బీఎంఎస్ ఆవిర్భావ దినోత్సవంలో జెండా ఆవిష్కరణ కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే ఇందూరు, జూలై 23:E6 tv NEWS శివ ఠాకూర్ దేశభక్తి, కార్మిక సంక్షేమం, సామాజిక బాధ్యతలను కేంద్రబిందువుగా చేసుకుని భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) దేశవ్యాప్తంగా సేవలందిస్తోందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. బీఎంఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నగరంలోని నిజామాబాద్-2 ఆర్టీసీ డిపోలో నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లోకమాన్య తిలక్ జయంతినాడే…

Read More

ఉచితంగా ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి.. ఖాళీగా ఉన్న 39,000 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను వెంటనే పంపిణీ చేయాలి: బీఆర్‌ఎస్ డిమాండ్!

హైదరాబాద్ : ఎన్నికల హామీ మేరకు నిరుపేదలకు ఉచితంగా ఇందిరమ్మ ఇళ్లను అందించాలని, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఖాళీగా ఉన్న 39,000 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను తక్షణమే అర్హులకు కేటాయించాలని బీఆర్‌ఎస్ (BRS) పార్టీ డిమాండ్ చేసింది. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పేరుతో లబ్ధిదారుల నుండి రూ. 6 లక్షలు వసూలు చేసే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని స్పష్టం చేసింది. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో బీఆర్‌ఎస్ నిలదీత గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత,…

Read More

ఏపీలో కోవిడ్ విజృంభణ: తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ కావాలి – మాజీ డీపీహెచ్ డాక్టర్ జి. శ్రీనివాసరావు హెచ్చరిక!

హైదరాబాద్ : పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్-19 కేసులు, మరణాలు పెరుగుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ మాజీ ప్రజారోగ్య సంచాలకులు (DPH) డాక్టర్ జి. శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. కోవిడ్ ముప్పుపై రాష్ట్ర ఆరోగ్య శాఖ నిర్లక్ష్యంగా ఉందంటూ ఆయన గురువారం మీడియా సమావేశంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాగితాలకే పరిమితమైన నివేదికలు.. పారదర్శకత కరువు! తెలంగాణలో కూడా కోవిడ్ పాజిటివ్ కేసులు, మరణాలు నమోదు అవుతున్నాయనే…

Read More

చాగంటి రాకతో రూరల్ నియోజకవర్గంలో ఆధ్యాత్మిక వాతావరణం

ప్రవచన చక్రవర్తికి ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి హృదయపూర్వక స్వాగతం నిజామాబాద్, జూలై 23: E6 tv NEWS (శివ ఠాకూర్). ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఈ నెల 24న నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి విచ్చేయనున్న సందర్భంగా ఆయనకు నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నట్లు రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి తెలిపారు.ఇందూరు గోసేవ సమితి ఆధ్వర్యంలో బోర్గాం(పి)లోని భూమారెడ్డి కన్వెన్షన్‌లో నిర్వహించనున్న “గోమాత వైభవం” కార్యక్రమానికి ముఖ్య…

Read More

హైదరాబాద్‌ ఓటర్ల జాబితా సవరణ: 2.60 లక్షలకు తగ్గిన ‘ASD’ ఓటర్ల సంఖ్య!

హైదరాబాద్ : హైదరాబాద్ జిల్లా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR-2026) ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. క్షేత్రస్థాయి పరిశీలన, నిర్ధారణ చర్యల తర్వాత జిల్లాలో అబ్సెంట్ (గైర్హాజరు), షిఫ్టెడ్ (స్థానచలనం), డెడ్ (మరణించిన) ఓటర్ల (ASD) సంఖ్య గణనీయంగా తగ్గి 2.60 లక్షలకు చేరింది. రీ-వెరిఫికేషన్‌తో తగ్గిన ఏఎస్‌డీ (ASD) సంఖ్య జూలై 15న జిల్లా ఎన్నికల అధికారి (DEO) ఆర్‌.వి.కర్ణన్ అందించిన ప్రాథమిక సమాచారం ప్రకారం దాదాపు 11.50 లక్షల మంది ఏఎస్‌డీ ఓటర్లు…

Read More