Breaking News

పేదలకు రూ.230కే సిమెంట్

తక్కువ ధరకే స్టీల్ అందించేందుకు చర్యలు: మంత్రి పొంగులేటి హైదరాబాద్,సెప్టెంబర్ 11:(E6tv NEWS). ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా పేదలకు సిమెంట్‌ను తక్కువ ధరకే అందించేలా కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మార్కెట్లో ప్రస్తుతం రూ.310 నుంచి రూ.320 వరకు ఉన్న సిమెంట్ బ్యాగును లబ్ధిదారులకు కేవలం రూ.230కే అందించేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్టీల్‌ను కూడా తక్కువ ధరకే…

Read More

అటవీ అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం

అటవీ సంపదతో పాటు గిరిజనుల హక్కుల పరిరక్షణకు సమన్వయంతో పనిచేయాలి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అటవీ నేరాల నియంత్రణ కొత్తగూడెం,సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి) విధి నిర్వహణలో అటవీ సంపద, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన అటవీ శాఖ అధికారులు, సిబ్బంది సేవలు, త్యాగాలు స్ఫూర్తిదాయకమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం కొత్తగూడెం ఇల్లందు క్రాస్‌రోడ్స్‌లోని చలమల శ్రీనివాసరావు మెమోరియల్ సెంట్రల్…

Read More

హుజూర్‌నగర్‌లో సెల్ టవర్ నిర్మాణంపై స్థానికుల అభ్యంతరం

నిర్మాణ పనులు నిలిపివేయాలని పురపాలక అధికారులకు వినతి హుజూర్‌నగర్, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి). హుజూర్‌నగర్ పట్టణంలోని ఏరియా ఆసుపత్రి ఎదురుగా చేపడుతున్న ఎయిర్‌టెల్ సెల్ టవర్ నిర్మాణంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నివాస ప్రాంతాలు, ఆసుపత్రికి సమీపంలో టవర్ ఏర్పాటు చేయడం వల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.టవర్ నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని కోరుతూ హుజూర్‌నగర్ పురపాలక సంఘం కమిషనర్, చైర్మన్‌కు స్థానికులు వినతిపత్రం సమర్పించారు….

Read More

కొనసాగుతున్న ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమం

డోంగ్లి, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి). కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండలం లింబూర్ గ్రామంలో శుక్రవారం ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు రైతుల భూములు, సాగు చేస్తున్న పంటలు, ఇతర వ్యవసాయ వివరాలపై రైతులతో చర్చించారు.గ్రామంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా రైతుల వివరాలు సక్రమంగా నమోదు చేసుకోవాలని, రైతులందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం…

Read More

అవుట్‌సోర్సింగ్‌కు వ్యతిరేకంగా ఉద్యోగుల నిరసన

పాల్వంచ, సెప్టెంబర్ 11: (E6tv NEWS: ప్రతినిధి). YTPS AHP, CHP విభాగాలను ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా అవుట్‌సోర్సింగ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ TGPEJAC ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జనరేటింగ్ ప్లాంట్లలో చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని KTPS VII STGలో ఉద్యోగులు నిరసన చేపట్టారు. KTPS VII STG చీఫ్ ఇంజనీర్ కార్యాలయం వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉద్యోగులు నిరసన ప్రదర్శన నిర్వహించారు….

Read More

తెలంగాణలో పెట్టుబడుల వరద రెండేళ్లలో 108 అవగాహన ఒప్పందాలు..

హైదరాబాద్: తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు తెలిపారు. గత రెండేళ్ల కాలంలో (2025 మరియు 2026) వివిధ దేశీయ, అంతర్జాతీయ సంస్థలు మరియు పారిశ్రామికవేత్తలతో కలిపి మొత్తం 108 అవగాహన ఒప్పందాలు (MoUs) కుదుర్చుకున్నట్లు శాసనసభలో వెల్లడించారు. శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ.. ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’, ‘బయోసియా’ (BioAsia) వంటి అంతర్జాతీయ వేదికలు…

Read More

ట్రాన్స్‌జెండర్లకు సముచిత స్థానం:కో-ఆప్షన్ బిల్లుకు అసెంబ్లీ గ్రీన్ సిగ్నల్!

హైదరాబాద్: తెలంగాణలోని మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్స్‌జెండర్లకు (ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు) కో-ఆప్టెడ్ సభ్యులుగా అవకాశం కల్పించే ‘తెలంగాణ మున్సిపాలిటీల (నాలాగో సవరణ) బిల్లు–2026’ కు రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరఫున శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు ఈ కీలక బిల్లును సభలో ప్రవేశపెట్టారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) మినహా, రాష్ట్రంలోని తొమ్మిది మున్సిపల్ కార్పొరేషన్లలో ఒక్కో ట్రాన్స్‌జెండర్‌ను కో-ఆప్టెడ్ మెంబర్‌గా నామినేట్ చేయడానికి ఈ…

Read More

బిగ్ బాస్ హౌస్‌లో శృతిమించుతున్న వివాదాలు

హైదరాబాద్: బిగ్ బాస్ తెలుగు షోలో వివాదాలు రోజురోజుకూ తారాస్థాయికి చేరుకుంటున్నాయి. కంటెస్టెంట్ల మధ్య వ్యక్తిగత దూషణలు హద్దులు దాటుతున్నాయి. ముఖ్యంగా రోహిత్‌ను లక్ష్యంగా చేసుకుని త్రిగున్ చేస్తున్న నిరాధార ఆరోపణలు, ‘స్టిరాయిడ్స్ వాడుతున్నావని’ కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకుల్లో తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నాయి. ప్రత్యర్థి రెచ్చగొడుతున్నప్పటికీ రోహిత్ సహనంతో వ్యవహరించిన తీరు అభినందనలు పొందుతోంది. ఈ తరహా ప్రవర్తనపై వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. మరోవైపు, ఎలాంటి ఆడియన్స్…

Read More

సికింద్రాబాద్ బొల్లారం ఆయుధాల చోరీ కేసు: కీలక సమాచారం లభ్యం

హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఆర్మోరీ (ఆయుధశాల) నుంచి 12 అత్యాధునిక తుపాకులు (AK-203, ఇన్సాస్ రైఫిళ్లు) మరియు సుమారు 2,000 రౌండ్ల మందుగుండు సామగ్రి చోరీకి గురైన ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై మిలటరీ ఇంటెలిజెన్స్, స్థానిక పోలీసులతో పాటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) రంగంలోకి దిగి విచారణను వేగవంతం చేసింది. ఆర్మోరీ భద్రతా విభాగంలో ఉన్న ఏడుగురు గార్డుల కళ్ళుగప్పి, సీసీటీవీ కెమెరాలు పనిచేయని సమయంలో ఈ చోరీ జరిగింది….

Read More

పంచాయతీలకు భారీ ఊరట: చట్ట సవరణను ప్రకటించిన మంత్రి సీతక్క

హైదరాబాద్: తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వయం ప్రతిపత్తి కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై పంచాయతీల సొంత ఆదాయం ప్రభుత్వ ట్రెజరీలతో సంబంధం లేకుండా నేరుగా వాటి స్థానిక బ్యాంకు ఖాతాల్లోనే జమ అయ్యేలా ‘తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం–2018’లోని సెక్షన్‌ 70(3)కి సవరణ చేస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క శాసనసభ వేదికగా ప్రకటించారు. ఇప్పటివరకు సొంత ఆదాయం ట్రెజరీలో జమ కావడంతో నిధులు విత్‌డ్రా చేసుకోవడానికి తీవ్ర విలంబం జరుగుతోందని…

Read More